ఎఫ్ ఎన్ సీసీ నిజాయితీ ప్రయత్నం ప్రశంసనీయం!
సాధారణంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న కొన్ని చిత్రాల విషయంలో? అప్పుడడప్పు కొన్ని ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి.;
సాధారణంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న కొన్ని చిత్రాల విషయంలో? అప్పుడడప్పు కొన్ని ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి. గెస్ చేసిన సినిమాకు అవార్డు రాకపోవడంతో? అవార్డల ఎంపికలో మోనోపలి ఉందని..రాజకీయ శక్తులు కూడా బ్యాకెండ్ లో పని చేస్తాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఆస్కార్ అవార్డుల విషయంలో కూడా ఇలాంటి అంశం చాలాసార్లు వ్యక్తమైంది. సాక్షాత్తు ఏ. ఆర్ . రెహమానే ఆస్కార్ అవార్డుల వెనుక ఎంతో రాజకీయం ఉంటుందని ఓపెన్ గానే అన్నారు. అదంతా డబ్బుతో ముడిపడి ఉంటుందని ఆరోపించారు.
ఇదంతా పక్కన బెడితే? తాజాగా ఎఫ్ ఎన్ సీ సీ( ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్) ఈ ఏడాది నుంచి అవార్డుల ప్రదానో త్సవానికి శ్రీకారం చుట్టింది. పరిమిత బడ్జెట్ లో రూపొందించిన మంచి చిత్రాలను తమ వంతుగా ప్రోత్సహించాలని ఈ కార్యానికి పూనుకున్నారు. ఎఫ్ ఎన్ సీసీలో డిసెంబర్ 31న నిర్వహిస్తోన్న ప్రత్యేక వేడుకల్లో? అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుందని అధ్యక్షులు కె.ఎస్ రామారావు వెల్లడించారు. సినిమాతో పాటు, టెలివిజన్ రంగాల్లో వారికి ఈ అవార్డులకు అందజేయనున్నారు. ఈ ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా `కోర్టు`ను ఎంపిక చేసారు.
ఈ సినిమా మంచి కంటెంట్ తో తెరకెక్కింది. కమర్శియల్ గానూ మంచి విజయం సాధించింది. అవార్డుకు అన్ని రకాలుగా అర్హత గలిగిన చిత్రం కూడా. గొప్ప సందేశం ఈ సినిమాలో ఉంటుంది. ఈసినిమా ను నిర్మించింది నాని. అతడు టాలీవుడ్ లో పెద్ద హీరో. పేరు పలుకబడి ఉన్న నటుడు కూడా. కానీ అవేమి చూడకుండా నిజాయితీగా `కోర్టు`ను ఎంపిక చేసారు. అలాగే ఉత్తమ దర్శకుడిగా `రాజు వెడ్స్ రాంబాయి` ని తెరకెక్కించిన సాయిలు కంపాటిని ఎంపిక చేసారు. అదే సినిమాలో నటించిన అఖిల్ రాజు, తేజస్వీ రావులను ఉత్తమ కథానాయకుడు,నాయికగా ఎంపిక చేయడం విశేషం.
`రాజు వెడ్స్ రాంబాయి` కూడా మంచి విజయం సాధించింది. సాయిలు కంపాటి ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఎంతో కాలం ఆ శాఖలో పనిచేసి `రాజు వెడ్స్ రాంబాయి`తో దర్శకుడు అయ్యాడు. ఈ సినిమాను కిల్ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆవేమి సక్సెస్ ముందు నిలబడలేదు. ఎఫ్ ఎన్ సీసీ అవార్డు కు ఈ చిత్రాన్ని కమిటీ ఎంతో నిజాయితీగా ఎంపిక చేసింది. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని టెక్నిషీయన్లను, నటీనటుల్ని ప్రోత్సహిస్తే మరింత మంది ప్రతిభావంతులు తెరపైకి వస్తారని ఎఫ్ ఎన్ సీసీ గుర్తించి ఎంపిక చేయడం విశేషం. ఇదెంతో నిజాయితీతో కూడిన ఓ మంచి ప్రయత్నమనే చెప్పాలి. అవార్డల విషయంలో ఎలాంటి రికమండీషన్లు, రాజకీయాలకు తావు ఇవ్వకుండా చేయగలిగితే? ఔత్సాహికులు ఎంతో ఆసక్తితో పరిశ్రమకు రావడానికి అవకాశం ఉంటుంది.