చిట్టిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. డైరెక్టర్లూ జర చూడండయ్యా!
అందానికి అందం అంతకుమించి హైట్ తో అందర్నీ ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
అందానికి అందం అంతకుమించి హైట్ తో అందర్నీ ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్టేజ్ పెర్ఫార్మర్ నుండి హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈమె.. తొలిసారి జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో అందరిని అబ్బురపరిచింది. ముఖ్యంగా తన అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈమె.. ఇందులో తన హైట్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని గ్రాబ్ చేసింది. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోల హైట్ తో సరి సమానంగా తూగుతూ తనలోని టాలెంట్ ను కూడా బయటపెట్టింది.
గ్లామర్ మాత్రమే కాదు టాలెంట్ కూడా..
హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు బంగార్రాజు చిత్రంలో స్పెషల్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. హీరోయిన్ గా, కొరియోగ్రాఫర్ గానే కాకుండా డాన్సర్ గా, గీతా రచయితగా, సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి వంటి చిత్రాలకు గీతా రచయితగా పనిచేయడమే కాకుండా గాయకురాలిగా పనిచేసి.. తనలోని టాలెంటును చూపించింది ఫరియా అబ్దుల్లా. ఇకపోతే ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు అయితే అమ్మడి ఖాతాలో పడడం లేదు.
మరో కొత్త వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్..
ఇదిలా ఉండగా తాజాగా మరోసారి తన గ్లామర్ ఒలకబోస్తూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వైట్ కలర్ బికినీను తలపించేలా డ్రెస్ ధరించిన ఈమె ఇందులో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న తీరుకి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫరియా అబ్దుల్లాలో ఈ యాంగిల్ కూడా ఉందా? పర్ఫెక్ట్ హీరోయిన్ పీస్.. ఎందుకు స్టార్ హీరోయిన్గా అవకాశాలు రావట్లేదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏకంగా హాలీవుడ్ చిత్రాలలో ట్రై చేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఇలాంటి హీరోయిన్ కి ఎందుకు మంచి ఆఫర్లు ఇవ్వడం లేదు కాస్త డైరెక్టర్లు ఈమెను కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ తమ అభిప్రాయాలను షేర్ చేయడం గమనార్హం.మొత్తానికైతే ఫరియా అబ్దుల్లా తనలోని అందాలను చూపిస్తూ షేర్ చేసిన వీడియో కన్నుల పండుగలా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఫరియా అబ్దుల్లా చిత్రాల విషయానికి వస్తే..
ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ మూవీ సిగ్మా సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే విజయ్ ఆంటోనీతో కలిసి ఒక తమిళ్ డ్రామా మూవీలో అవకాశం అందుకున్న ఫరియా అబ్దుల్లా సత్యదేవ్ కంచరతో ఒక సినిమా చేస్తోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మసూద్ ఫేమ్ తిరువీర్ తో కలిసి భగవంతుడు అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటుంది కానీ సరైన అవకాశం మాత్రం తలుపు తట్టడం లేదు.