'దీపికకు అంత టైమ్ లేదులే'.. డెబ్యూ డైరెక్టర్ సెటైర్లు..

దీంతో దీపిక చెబుతున్న 8 గంటలపాటు వర్క్ చేసే విషయంపై సినీ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.;

Update: 2025-09-27 20:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బీ టౌన్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన అమ్మడు.. వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు అనేక సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న దీపిక.. ఇప్పుడు మరిన్ని చిత్రాలతో బిజీగా ఉన్నారు.

కల్కి 2898 ఏడీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపిక.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వర్క్ చేస్తున్నారు. కానీ ఇటీవల స్పిరిట్ తో పాటు కల్కి సీక్వెల్ ప్రాజెక్టులను చేజార్చుకున్నారు. కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని దీపిక చెబుతుండడంతో ఆయా సినిమాల మేకర్స్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో దీపిక చెబుతున్న 8 గంటలపాటు వర్క్ చేసే విషయంపై సినీ వర్గాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు దీపికపై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ కూడా అదే చేశారు.

రీసెంట్ గా ఆమె బీ టౌన్ నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో యూట్యూబ్ వ్లాగ్ షూట్ చేశారు. అప్పుడు ఫరా ఖాన్.. రోహిత్ సరఫ్ తల్లి ఫేస్ ను రివీల్ చేశారు. ఆమెను అంతా చూడటం ఇదే తొలిసారి. దీంతో ఆ సమయంలో ఫరా.. దీపికను ఓ సినిమా కోసం ఒప్పించడానికి కూడా ఇంత టైమ్ పట్టదని వ్యంగ్యంగా మాట్లాడారు.

అప్పుడే ఫరా ఖాన్ చెఫ్.. దీపిక మన షోకు ఎప్పుడొస్తారని అడిగారు. అప్పుడు ఆమెకు టైమ్ లేదని అన్నారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే వర్క్ చేస్తుందని అన్నారు. అందుకే షోలో పార్టిసిపేట్ చేసే అంత సమయం లేదని సెటైర్ వేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. ఇక్కడ మరో విషయమేమిటంటే.. దీపిక హీరోయిన్ గా డెబ్యూ మూవీ ఫరాఖాన్ తోనే చేశారు. షారుక్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం లో నటించారు. ఆ తర్వాత న్యూ ఇయర్ మూవీకి గాను మరోసారి ఫారాతో చేతులు కలిపారు. అందులోనూ షారుకే హీరోగా నటించడం గమనార్హం. మొత్తానికి దీపిక నిర్ణయం ఫరాకు నచ్చనట్లు ఉంది. అందుకే సెటైర్ వేసినట్లు అర్థమవుతుంది.

Tags:    

Similar News