అవతార్ తో 'వారణాసి'.. జక్కన్న ప్లాన్ ఏంటి?

ఇప్పటికే శరవేగంగా ప్రాజెక్టు షూటింగ్ జరుగుతుండగా.. వారణాసి మేకర్స్ రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.;

Update: 2025-11-16 16:30 GMT

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న ఆ సినిమాలో మహేష్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే శరవేగంగా ప్రాజెక్టు షూటింగ్ జరుగుతుండగా.. వారణాసి మేకర్స్ రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయగా.. ఓ రేంజ్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

వీడియోలో చూపించిన రాజమౌళి అండ్ టీమ్ చూపించిన విజువల్స్ వావ్ అనేలా ఉన్నాయి. మూవీపై హోప్స్ ను ఆకాశాన్ని తాకేలా చేశాయి. టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, యాక్షన్ అడ్వెంచర్ జోనర్స్ లో సినిమా ఉంటుందని గ్లింప్స్ చెప్పకనే చెప్పింది. ఏదేమైనా గ్లింప్స్ రిలీజ్ తర్వాత రాజమౌళికి అభిమానులు ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న అవతార్: ఫైర్ అండ్ యాష్ మూవీతోపాటు వారణాసి గ్లింప్స్ ప్లే అయ్యేలా ప్లాన్ చేయాలని కోరుతున్నారు. అనేక దేశాల్లో అవతార్ రిలీజ్ అవ్వనుండగా.. వారణాసి గ్లింప్స్ కూడా అందరికీ చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. సినిమాకు చాలా హెల్ప్ అవుతుందని చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాపై కచ్చితంగా బజ్ క్రియేట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. అయితే ఆ విషయంలో రాజమౌళి అండ్ కో ఎలాంటి ప్లాన్ తో ఉన్నారనేది ఆసక్తికరం. నిజానికి అవతార్ చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ తో జక్కన్నకు మంచి సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకే ఆయనతోనే రాజమౌళి.. వారణాసి మూవీ టైటిల్ తోపాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తారని కొన్ని రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అంతా అదే ఫిక్స్ అయ్యారు. కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఏర్పాటు చేసిన రిలీజ్ చేశారు జక్కన్న. మరి ఇప్పుడు అవతార్ ఫ్రాంఛైజీ కొత్త మూవీకి వారణాసి గ్లింప్స్ ను అటాచ్ చేస్తారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News