మ‌రోటి కావాలంటున్న పెద్ది ఫ్యాన్స్

పెద్ది సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2026-05-26 07:59 GMT

పెద్ది సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై మొదటి నుంచీ భారీ హైప్ నెలకొంది. పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్.. ఇలా రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ రఫ్ అండ్ మాస్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా రిలీజైన‌ ట్రైలర్ విషయంలో మాత్రం మిక్డ్స్ రెస్పాన్స్ కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు వచ్చినప్పటికీ, కథను ఎలివేట్ చేసే ఎమోషనల్ హుక్ మిస్సయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఆడియ‌న్స్ ట్రైలర్‌లో అసలు కథేంటో క్లారిటీ రాలేద‌ని, చరణ్ మేకోవర్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారంటూ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి నెక్ట్స్ లెవెల్ కంటెంట్ ఆశిస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ పూర్తిగా కనెక్ట్ కాలేదనే చర్చ జరుగుతోంది. దీంతోనే ఇప్పుడు సోషల్ మీడియాలో మ‌రో ట్రైల‌ర్ కావాల‌నే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. పలు ఫ్యాన్ పేజీలు కూడా మరో పవర్‌ఫుల్ ట్రైలర్‌తో సినిమా హైప్‌ను మరింత పెంచాలని మేకర్స్‌ను కోరుతున్నాయి.

ఇదే సమయంలో టాలీవుడ్‌లో ఇటీవల పెద్ద సినిమాలు ఫైనల్ ట్రైలర్ లేదా సెకండ్ ట్రైలర్‌తో బజ్‌ను పెంచుకున్న ఉదాహరణలను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మొదటి ట్రైలర్‌కు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చిన కొన్ని సినిమాలు రిలీజ్‌కు ముందు మరో కట్ రిలీజ్ చేసి మంచి హైప్ తెచ్చుకున్న సందర్భాలున్నాయి. దీంతో పెద్ది టీమ్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుందా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్ లో కొత్త ట్రైలర్ లేదా యాక్షన్ కట్ రిలీజ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినా, మేకర్స్ మాత్రం అభిమానుల రియాక్ష‌న్‌ను గమనిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు కొంతమంది సినీ విశ్లేషకులు మాత్రం ట్రైలర్ చూసి సినిమాను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. గతంలో కూడా ట్రైలర్లకు మిక్డ్స్ టాక్ వచ్చినా థియేటర్లలో భారీ విజయాలు సాధించిన సినిమాలున్నాయని గుర్తు చేస్తున్నారు. పెద్ది విషయంలో కూడా దర్శకుడు బుచ్చిబాబు సాన అసలు ఎమోషనల్ కోర్‌ను దాచిపెట్టారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్‌లో స్టోరీని పూర్తిగా రివీల్ చేయకుండా, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం కొన్ని కీలక అంశాలను హైడ్ చేసి ఉండొచ్చని అంటున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం పెద్ది చుట్టూ జరుగుతున్న చర్చ మొత్తం ఒకే విషయంపై నిలిచిపోయింది. అదే సెకండ్ ట్రైలర్. అభిమానుల అంచనాలను మరోసారి హై లెవల్‌కు తీసుకెళ్లేలా మేకర్స్ కొత్త కట్ ప్లాన్ చేస్తారా? లేక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పైనే నమ్మకం ఉంచుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్‌కు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినా, సినిమాపై ఉన్న భారీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

Tags:    

Similar News