వైరల్‌ వీడియో : చేతికి ఐవీ డ్రిప్‌తో థియేటర్‌కి..!

తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఒక సినీ ప్రేక్షకుడు చేతికి ఐవీ డ్రిప్‌ పెట్టుకుని మరీ థియేటర్‌కి వెళ్లాడు.;

Update: 2025-07-22 07:03 GMT

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సయ్యారా సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. సినిమా విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు కూడా దక్కని భారీ ఓపెనింగ్స్ నమోదు అయిన విషయం తెల్సిందే. సయ్యారా సినిమా బాలీవుడ్‌కి పూర్వ వైభవం తీసుకు వచ్చిందని అంతా అంటున్నారు. చిన్న సినిమాగానే వచ్చినప్పటికీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వీకెండ్‌ తర్వాత ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ వీక్ డేస్‌లోనూ సయ్యారా సినిమాకు విపరీతమైన వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా బాక్సాఫీస్‌ రిపోర్ట్‌లను చూస్తే అర్థం అవుతుంది.

రాబోయే రెండు మూడు వారాల వరకు ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద ఉంటుంది, ఉండటం మాత్రమే కాకుండా సందడి చేస్తుంది అనే నమ్మకంను బాలీవుడ్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమాను యూత్‌ ఆడియన్స్‌ ఓన్‌ చేసుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాబోయ్‌ ఈ స్థాయిలో సినిమాను జనాలు చూస్తున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత వెంటనే జనాలు ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న ఈ సమయంలో థియేటర్‌లోనే చూడాలి అనిపించేంత పాజిటివ్‌ మౌత్‌ టాక్ ఈ సినిమాకు వచ్చింది. పైగా ఈ సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌ బస్టర్‌గా నిలవడంతో చాలా మంది సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

సినిమా థియేటర్‌లలో జనాలను చూస్తూ ఉంటే ఇన్నాళ్ల తర్వాత థియేటర్లకు కళ వచ్చిందని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. నార్త్‌ ఇండియాలో థియేటర్లకు ఈ స్థాయిలో జనాలు వెళ్లడం ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఒక సినీ ప్రేక్షకుడు చేతికి ఐవీ డ్రిప్‌ పెట్టుకుని మరీ థియేటర్‌కి వెళ్లాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న అతడు క్యాన్లా ను చేతికి పెట్టుకున్నాడు. అయినా కూడా సినిమాపై వచ్చిన పాజిటివ్‌ టాక్‌, సినిమా గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా సినిమాను థియేటర్‌లో చూసేందుకు అతడు ఈ సాహసం చేశాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సయ్యారా ఫీవర్ దేశాన్ని ఏ స్థాయిలో ఊపేస్తుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో నటించిన హీరో అహన్‌ పాండే, హీరోయిన్‌గా నటించిన అనీత్‌ పడ్డా లకు ఓవర్‌ నైట్‌లో స్టార్‌డం దక్కింది. తక్కువ సమయంలోనే వీరిద్దరు బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ స్టార్‌ సెలబ్రిటీలు అయ్యారు. మరో వైపు వీరితో సినిమాల కోసం బాలీవుడ్‌తో పాటు, సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్, నిర్మాతలు సైతం క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్న ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీకి మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో వందల కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News