• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ఫ్యామిలీ స్టార్’ డైలాగ్...

‘ఫ్యామిలీ స్టార్’ డైలాగ్ వైరలైపోయింది!

| 'మిర్చి' సినిమాలో నా ఫ్యామిలీ సేఫ్ అని ప్రభాస్ చెప్పే డైలాగ్ స్థానంలో 'ఐరన్నే వంచాలా ఏంటి' అనే డైలాగ్ పెట్టి క్రియేట్ చేసిన ఒక మీమ్ వైరల్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2023-10-27 00:30 GMT

కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఏది పాపులర్ అవుతుందో.. ఏం వైరల్ అవుతుందో చెప్పలేం. నెటిజన్లకు కొన్ని విషయాల మీద ఉన్నట్లుండి ఆసక్తి పుట్టి దాన్ని పాపులర్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'ఫ్యామిలీ స్టార్'లోని ఒక డైలాగ్ కొంచెం లేటుగా సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఈ టీజర్ చివర్లో ఒక ఇనుప కడ్డీని వంచుతూ విజయ్.. "ఐరన్నే వంచాలా ఏంటి" అని డైలాగ్ చెబుతాడు. టీజర్లో కొసమెరుపులా ఉన్న ఆ సీన్, డైలాగ్ బాగానే ఆకట్టుకున్నాయి. ఐతే టీజర్ రిలీజైనప్పుడు ఈ డైలాగ్ విషయంలో జనాలు మరీ ఏమీ ఊగిపోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ డైలాగ్ అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాను ఈ డైలాగ్ ఊపేస్తోంది. 'ఐరన్నే వంచాలా ఏంటి' అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ఒక రేంజిలో ట్రెండ్ అవుతోంది. దీని మీద జోక్స్, మీమ్స్ మామూలుగా లేవు.

తెలుగు సినిమాల్లో పాపులర్ సీన్లు చాలా వాటికి ఈ డైలాగ్‌ను జోడించి దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. 'మిర్చి' సినిమాలో నా ఫ్యామిలీ సేఫ్ అని ప్రభాస్ చెప్పే డైలాగ్ స్థానంలో 'ఐరన్నే వంచాలా ఏంటి' అనే డైలాగ్ పెట్టి క్రియేట్ చేసిన ఒక మీమ్ వైరల్ అవుతోంది. దీని మీద విజయ్ కూడా స్పందించాడు.

అసలేం జరుగుతోంది ట్విట్టర్లో అని అతను ఆశ్చర్యపోయాడు. 'ఫ్యామిలీ స్టార్'ను నిర్మిస్తున్న వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా దీని మీద స్పందించారు. 'పుష్ప'లోని తగ్గేదేలే.. తరహాలో ఈ 'ఐరన్నే వంచాలా ఏంటి' అనే డైలాగ్ హుక్ వర్డ్ లాగా మారిపోయి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సినిమాకు ఇది మంచి ప్రచారం తెచ్చిపెడుతుండటంతో టీం అంతా హ్యాపీగా ఈ ట్రెండ్‌ను ఎంజాయ్ చేస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Mind lonunchi povatle🏃‍♂️🏃‍♂️ pic.twitter.com/KYjSPGbu8F

— Nandu (@JaiSantoshhhh) October 25, 2023
Tags:    
  • Vijaydevarkonda 
  • Familystar 
  • Movieteaser 
  • Venkateshwaracreations 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS