రూ.13 కోట్ల కారు కొన్న పుష్ప విలన్.. స్పెషల్ ఏమిటంటే?
దీని ధర భారత్ లో రూ.13 కోట్ల పైనే ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికే ఇష్టపడతారు. ఉండే ఇళ్లు, తిరిగే కారు, వేసుకునే బట్టలు ఇలా అన్నీ బ్రాండెడ్ ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు కార్లపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరు మూడు, నాలుగేసి కార్లను తమ గ్యారేజ్ లో ఉండేలా చూసుకుంటారు.
కోట్లు విలువచేసే కాస్ట్లీ కార్లు కొంటుంటారు. తమ వద్ద కార్లు ఉన్నప్పటికీ.. మార్కెట్ లోకి వచ్చే లేటెస్ట్ కార్లు కొనుగోలు చేయాలని ఆశ పడుతుంటారు. అలా ఒక్కో స్టార్ హీరో ఇంట్లో ఆర డజను కార్లు కూడా ఉంటాయి. తమ మూడ్ ను బట్టి ఆయా కార్లలో తిరుగుతారు. కాగా, ఈ లిస్ట్ లో తాజాగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ చేరిపోయారు. ఆయన లేటెస్ట్ గా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు.
ప్రముఖ రేసింగ్ కంపెనీ ఫెరారీ నుంచి లేటెస్ట్ మాడల్ స్పోర్ట్స్ కారును ఫాహద్ ఫాజిల్ కొనుగోలు చేశారు. ఆయన తీసుకున్న కారు ఫెరారీ పురోసాంగ్ - ప్రాన్సింగ్ హార్సెస్ ఫస్ట్ 4- డోర్ ఎస్ యూ వీ కారు. దీని ధర భారత్ లో రూ.13 కోట్ల పైనే ఉంటుందని అంచనా. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షోరూమ్ లోనే కారు ముందు ఫాహద్ సింపుల్ గా నిల్చోని ఫొటోకు ఫోజిచ్చారు. బ్యాక్ సైడ్ కారు కనిపిస్తుంది. ప్యూర్ వైట్ కలర్ లో ఉన్న ఫెరారీ అద్భుతంగా మెరిసిపోతుంది. కారు వీల్స్ డిజైనింగ్ అత్యంత స్టైలిష్ గా ఉంది. ఇక లోపలి భాగంలో బ్లూ కలర్ సీట్ కవర్స్ తో ఫుల్ ఆట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఇది 4 సీటర్ కారు అని ఫొటోలు చూస్తే అర్థం అవుతుంది. వెనకాల రెండు కెప్టెన్ సీట్లు ఉన్నాయి. లోపలంతా ఫుల్ లగ్జరీగా ఉంది.
ఈ కారు పూర్తిగా రేసింగ్ కారు గా తెలుస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 km/h స్పీడ్ అందుకుంటుందట. అలాగే దీని టాప్ స్పీడ్ 310 km/h గా తెలుస్తోంది. అంటే బాగా అడ్వాన్స్ డిజైన్ మోడల్ కారుగా కనిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఫాహద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ సేఫ్టీ కూడా చెబుతున్నారు.