నితిన్ ఎక్స్ ట్రా…. స్ట్రాంగ్ డేట్ సెట్ చేసుకున్నాడుగా..

Update: 2023-07-23 14:13 GMT

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నితిన్ 32 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ యాక్షన్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.


దీంతో పాటు టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశారు. సినిమాకి ఎక్స్ ట్రా అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఆర్జనరీమెన్ ట్యాగ్ లైన్ గా పెట్టారు. అలాగే ఫుల్ గెడ్డంతో బ్లాక్ డ్రెస్ లో సీరియస్ నోట్ లో ఒక లుక్ ఉంది. దానికి ముందుగా క్లాప్ బోర్డు ముందు స్టైలిష్ గా కూర్చున్న మరో లుక్ కూడా ఉంది. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా స్క్రిప్ట్ వెర్షన్ ఇమేజ్ ని రిప్రజెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ పోస్టర్ లో మూవీ థీమ్ కూడా డైరెక్ట్ గా రివీల్ చేశారు. ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లోనే ఈ కథ ఉండబోతోందని ఫస్ట్ లుక్ పోస్టర్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఎక్స్ ట్రా అని టైటిల్ పెట్టడం ద్వారా అతని పాత్ర తీరుని ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పరంగా అయితే ఇంప్రెసివ్ గా ఉందని చెప్పాలి.

నితిన్ కెరియర్ లో మొదటిసారిగా డిఫరెంట్ రోల్ ని ఈ మూవీ కోసం ట్రై చేస్తున్నాడు. నా పేరు సూర్య తర్వాత వక్కంతం వంశీ నుంచి రాబోతున్న సినిమా ఎక్స్ ట్రా. ఈ సినిమా నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో తెరకెక్కుతోంది. హరీష్ జయరాజ్ చాలా కాలం తర్వాత తెలుగులో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

డిసెంబర్ 23న ఎక్స్ ట్రా మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారుఇక అదే టైమ్ లో వెంకటేష్ సైంధ‌వ్‌, నాని హయ్ నాన్న రిలీజ్ కానున్నాయి. ఇక వక్కంతం వంశీ దర్శకుడిగా నా పేరు సూర్య మొదటి సినిమా. అది ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అలాగే నితిన్ చివరి సినిమా మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టర్ అయ్యింది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే మూవీ ఏ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News