సింహాద్రి సెంటిమెంట్ దేవ‌ర‌కు మళ్లీ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన శాటిలైట్ డీల్స్ సాధారణంగా రిలీజ్ కు ముందే పూర్తవుతుంటాయి.

Update: 2026-05-26 09:44 GMT

టాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన శాటిలైట్ డీల్స్ సాధారణంగా రిలీజ్ కు ముందే పూర్తవుతుంటాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌తో వచ్చిన సినిమా అయితే టీవీ హక్కుల కోసం ఛానెల్స్ మధ్య గట్టి పోటీ కనిపించడం సహజం. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ సినిమా దేవర విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. థియేటర్ రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమా శాటిలైట్ డీల్ అధికారికంగా క్లోజ్ కాలేదన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇంతకాలం శాటిలైట్ పార్ట‌న‌ర్ ఫైనల్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ లేట్ కు మెయిన్ రీజ‌న్ రేట్ వ్యవహారమేనన‌ని తెలుస్తోంది. నిర్మాత కళ్యాణ్ రామ్ మొదటి నుంచీ దేవర శాటిలైట్ హక్కులకు భారీ రేటు ఆశించినట్టు చెబుతున్నారు. అయితే ఛానెల్స్ నుంచి వచ్చిన ఆఫర్లు ఆ స్థాయికి చేరకపోవడంతో డీల్ పదేపదే ఆగిపోయిందని టాక్. స్టార్ మా, జీ తెలుగు, జెమిని వంటి ప్రధాన ఛానెల్స్ దేవ‌ర రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫైనల్ స్టేజ్‌లో ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోయిందని వినికిడి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈటీవీ పేరు రేసులోకి రావడం ఊహించని ట్విస్ట్‌గా మారింది. భారీ ఆఫర్ కాకపోయినా ఒక డీసెంట్ మొత్తాన్ని ప్రతిపాదిస్తూ ఈటీవీ ముందుకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ విష‌యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం సింహాద్రి సెంటిమెంట్. ఎన్టీఆర్‌ను సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన వేదికల్లో ఈటీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక దశలో తారక్ సినిమాల టెలివిజన్ ప్రసార హక్కులను ఈటీవీ వరుసగా సొంతం చేసుకుంది. ఇప్పటికీ సింహాద్రి సినిమా టీవీలో టెలికాస్ట్ అవుంతుందంటే ఫ్యాన్స్‌లో స్పెష‌ల్ ఎన‌ర్జీ కనిపిస్తుంటుంది. అల్లరి రాముడు లాంటి సినిమాలు కూడా ఈటీవీ లైబ్రరీలోనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు దేవర కూడా అదే ఛానెల్‌కు వెళ్తుందా అనే చర్చ అభిమానుల్లో నాస్టాల్జియా ఫీలింగ్‌ను తెస్తోంది. ఈ నేప‌థ్యంలో సింహాద్రి సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా? అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే మరోవైపు కొంతమంది అభిమానులు మాత్రం ఈటీవీ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవర నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటంతో, అదే స్థాయి బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఛానెల్‌లో టెలికాస్ట్ కావాలని వారు కోరుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ రేంజ్ సినిమా ఈటీవీలోనా? అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. కానీ మీడియా విశ్లేషకులు మాత్రం ఈటీవీని తక్కువ అంచనా వేయొద్దని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఓటీటీ, ప్రొడక్షన్, డిజిటల్ విభాగాల్లో దూకుడు పెంచిన ఈటీవీ, ఇప్పుడు క్రేజీ సినిమాల శాటిలైట్ హక్కులపై కూడా దృష్టి పెట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

మరోవైపు ఈ డీల్ వెనుక స్టార్ మా, జీ తెలుగు, జెమిని, ఈటీవీ మధ్య బ్యాక్‌డోర్ బిడ్డింగ్ కూడా జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎవరికి దక్కినా దేవర టీవీ ప్రీమియర్ మాత్రం భారీ టీఆర్‌పీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఫైనల్ నిర్ణయం మాత్రం నిర్మాత కళ్యాణ్ రామ్ చేతుల్లోనే ఉంది. ఆయన ఈటీవీ ఆఫర్‌ను అంగీకరిస్తారా? లేక ఇంకా పెద్ద డీల్ కోసం వేచిచూస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని డిజిటల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

F

Tags:    

Similar News