ప్రేమ‌-రొమాన్స్ కోల్పోయాన‌ని బ‌హిరంగంగా అంగీక‌రించిన న‌టి!

విడాకుల తర్వాత కూడా ఈ మాజీ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు, రాధ్య - మిరాయా ఆల‌నాపాల‌న‌ను ఎంతో బాధ్యతాయుతంగా షేర్ చేసుకుంటున్నారు.

Update: 2026-06-27 03:21 GMT

డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని కుమార్తె ఇషా డియోల్ క‌థానాయిక‌గా కెరీర్ ని ముగించాక వ్యాపార‌వేత్త భ‌ర‌త్ త‌ఖ్తానీని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అయితే అత‌డితో 12 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 7 ఫిబ్రవరి 2024న తమ విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడిపోవడానికి క‌చ్చితమైన కారణాలను వారు వెల్లడించక‌పోయినా పబ్లిక్ ఫిగర్స్‌గా ఈ క్లిష్టమైన దశను ఎంతో గౌరవప్రదంగా, హుందాగా ఎదుర్కొంటామని వారు స్పష్టం చేశారు.

విడాకుల తర్వాత కూడా ఈ మాజీ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు, రాధ్య - మిరాయా ఆల‌నాపాల‌న‌ను ఎంతో బాధ్యతాయుతంగా షేర్ చేసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు, శ్రేయస్సే తమకు అత్యంత ముఖ్యమని వారు పేర్కొన్నారు. జీవితంలో పరిస్థితులను బట్టి బంధాల స్వరూపం మారినా.. పిల్లల కోసం ఇద్దరు పరిణతి చెందిన వ్యక్తులుగా ఒక కొత్త సమీకరణంతో కలిసి పనిచేస్తూ.. కుటుంబాన్ని ఏకంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈషా డియోల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇటీవల `కర్లీ టేల్స్` పాడ్‌కాస్ట్‌లో ఈషా డియోల్ మాట్లాడుతూ... తన జీవితంలో ప్ర‌స్తుతం అత్యంత ముఖ్య‌మైన‌ ప్రేమ, రొమాన్స్ లోపించాయని... స‌హ‌చ‌రుడి కోసం తాను ఎదురుచూస్తున్నట్లు మనసులో మాటను షేర్ చేసారు. గతంలో బోయ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్‌లు అయ్యాయ‌ని... అయినా ప్రేమపై తనకున్న నమ్మకం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. తన తల్లిదండ్రులు హేమమాలిని, ధర్మేంద్రల మధ్య ఉన్న నిరంతర ప్రేమే తనకు ఆదర్శమని.. భవిష్యత్తులో మళ్లీ ప్రేమలో పడతాననే ఆశాభావాన్ని ఇషా డియోల్ వ్యక్తం చేశారు.

మరోవైపు ఇషా డియోల్ మాజీ భర్త భరత్ తఖ్తానీ తన జీవితంలో ముందుకు సాగిపోయారు. అత‌డు ప్రముఖ వ్యాపారవేత్త మేఘ్నా లఖానీతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మేఘ్నాతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ `వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ` అని.. `ఇట్స్ అఫీషియల్` అనే హ్యాష్ ట్యాగ్‌తో భరత్ పోస్ట్ చేశారు. మేఘ్నా సైతం మాడ్రిడ్‌లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ``ఇక్కడి నుంచే ప్రయాణం మొదలైంది`` అని క్యాప్షన్ ఇచ్చారు.

Tags:    

Similar News