‘అర్జున్ రెడ్డి’ బాటలో ‘ఎపిక్’.. అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ లో బేబీ చిత్రంతో ఘన విజయం సాధించి అందరి మనస్సు దోచుకున్న క్రేజీ కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ సూపర్ హిట్ జోడీ మళ్లీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'ఎపిక్'.

Update: 2026-09-08 11:08 GMT

టాలీవుడ్ లో బేబీ చిత్రంతో ఘన విజయం సాధించి అందరి మనస్సు దోచుకున్న క్రేజీ కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ సూపర్ హిట్ జోడీ మళ్లీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'ఎపిక్'. ఆదిత్య హాసన్ '90స్' వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నరు. ఇప్పుడు ఈ లండన్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీకి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 11న విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్ రావడంతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యే అవకాశం ఉండటంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుందేమోనన్న చర్చ మొదలైంది.

‘A’ సర్టిఫికేట్‌తో వచ్చే చిక్కులు:

'బేబీ' సినిమాలో కూడా కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నప్పటికీ అప్పట్లో 'U/A' సర్టిఫికేట్ వచ్చింది. దీంతో ఫ్యామిలీస్, యూత్ అందరూ థియేటర్లకు తరలివచ్చి ఆ సినిమాను రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ చేశారు. కానీ 'ఎపిక్' చిత్రానికి నేరుగా 'A' సర్టిఫికేట్ జారీ చేయడంతో 18 ఏళ్ల లోపు ఉన్నవారు థియేటర్లలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇక ఇది కచ్చితంగా కలెక్షన్లను నియంత్రించే అంశమే అంటున్నారు విశ్లేషకులు.

ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవుతారా?:

సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల సినిమాలకు 'A' సర్టిఫికేట్ వచ్చినా మాస్, యాక్షన్ వల్ల బాక్సాఫీస్ వద్ద మేనేజ్ చేయగలుగుతారు. కానీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల లాంటి మిడ్-రేంజ్ నటుల సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ రష్ చాలా ముఖ్యం. ఇక అడల్ట్ సర్టిఫికేషన్ పడటం వల్ల కుటుంబ సమేతంగా వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే. దీనివల్ల వసూళ్లు తగ్గి నిర్మాతలకు నష్టం వచ్చే ప్రమాదం ఉంది.

బోల్డ్ కంటెంట్ క్లిక్ అవుతుందా?:

గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి కూడా 'A' సర్టిఫికేట్ వచ్చింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాతో సంచలనం సృష్టించి విజయ్‌ని స్టార్‌గా మార్చేశారు. ఇప్పుడు ఆదిత్య హాసన్ కూడా అదే రీతిలో బోల్డ్ అండ్ మెచ్యూర్డ్‌గా 'ఎపిక్' చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే అర్జున్ రెడ్డి తరహాలో యూత్‌ను ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందనే దానిపైనే బాక్సాఫీస్ విజయం ఆధారపడి ఉంది.

సెప్టెంబర్ 11న అసలైన పరీక్ష:

యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ రాక వల్ల జరిగే లోటును పూడ్చడం సాధ్యం కాదు. యూత్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే నిర్మాతలు కలెక్షన్ల పరంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది అంటున్నారు.

మొత్తానికి 'ఎపిక్' సినిమా ముందు 'A' సర్టిఫికేట్ రూపంలో పెద్ద సవాలే నిలిచింది. మరి సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ఈ లవ్ స్టోరీ 'A' సర్టిఫికేట్ అడ్డంకిని దాటుకుని 'బేబీ' స్థాయి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News