హిట్ తో కాదు ప్లాప్ తో క‌లిసొచ్చింద‌న్న న‌టి!

స‌క్సెస్ కంటే వైఫ‌ల్యాల నుంచే ఎన్నో విష‌యాలు నేర్చుకుంటారు. విజ‌యం అనే మ‌త్తు నుంచి గ‌ర్వం త‌లకెక్కుతుంది? అదే వైఫ‌ల్యం ఎన్నో విష‌యాలు అర్ద‌మ‌య్యేలా చేస్తుంది.;

Update: 2026-01-05 22:30 GMT

స‌క్సెస్ కంటే వైఫ‌ల్యాల నుంచే ఎన్నో విష‌యాలు నేర్చుకుంటారు. విజ‌యం అనే మ‌త్తు నుంచి గ‌ర్వం త‌లకెక్కుతుంది? అదే వైఫ‌ల్యం ఎన్నో విష‌యాలు అర్ద‌మ‌య్యేలా చేస్తుంది. మ‌నిషిలో క‌సి , ప‌ట్టుద‌ల‌ను పెంచుతుంది. త‌దుప‌రి త‌ప్పిదాలు దొర్ల‌కుండా జాగ్ర‌త్త పడేలా చేస్తుంది. `మ‌స్తీ 4` ప్లాప్ నుంచి ఎల్నాజ్ నౌరోజీ ఎన్నో విష‌యాలు తెలుసుకున్న‌ట్లు తెలిపింది. భారీ అంచ‌నాల మ‌ధ్య బాలీవుడ్ చిత్రం `మ‌స్తీ 4` రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. కానీ న‌టిగా త‌న‌ను తాను మరింత మెరుగు ప‌రుచుకోవ‌డానికి ఆ వైఫ‌ల్యం ఎంతో దోహ‌దం చేసిందంది.

ఆ సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా? అందులో తాను పోషించిన పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయంది.  'కామెడీ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. 'మ‌స్తీ 4' తో ఆ క‌ల తీరిపోయింది. కామెడీ కూడా చేయ‌గ‌ల‌నని ఆ సినిమా నాలో ఉత్సాహాన్ని నింపింది. 'సీక్రెడ్ గేమ్స్', 'అభ‌య్' లాంటి చిత్రాల్లో సీరియ‌స్ పాత్ర‌లు పోషించాను. `రాణ్నితి`లో ఇంకా సీరియ‌స్ రోల్ పోషించాను. ఈ క్ర‌మంలో `మ‌స్తీ 4` చేసాను. ఈ సినిమా వైఫ‌ల్యం చెందింద‌ని బాధ ప‌డుతూ కూర్చోలేదు. ఎందుకంటే సినిమా స‌క్సెస్ కి ఎన్నో అంశాలు క‌లిసి రావాలి.

అలా కుద‌ర‌న‌ప్పుడు? విజ‌యం సాధించ‌వు. న‌టిగా త‌న బాధ్య‌త న‌టించ‌డం స‌క్సెస్ అన్న‌ది ప్రేక్షకులు ఇవ్వాల్సింది. ఫెయిలైంది అన్న బాధ రెండు రోజులుంటుంది. ఆ త‌ర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. ఈ సినిమా విష‌యంలో ట్రోలింగ్ ను ఎంత మాత్రం ప‌ట్టించుకోలేదు. ఈ కాలంలో ట్రోలింగ్ అన్న‌ది స‌హ‌జంగా మారింది. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా చిన్న చిన్న విష‌యాల‌కే ట్రోలింగ్ జ‌రుగుతుంది. ఇలాంటి నెగిటివిటీని ప‌ట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్ల‌లేం అని చెప్పుకొచ్చింది.

`మ‌స్తీ 4` ప్లాప్ తో లోపాల‌ను గుర్తించాను. త‌ర్వాత వాటిని ఎలా స‌రిదిద్దుకోవాలో ఆలోచించి ఓ నిర్ణ‌యం తీసుకు న్నాను. కొన్ని సినిమాల‌కు ఆడియ‌న్స్ న‌టీన‌టుల‌పై న‌మ్మ‌కంతో వ‌స్తారు. అలాంటి వారిని సంతృప్తి ప‌ర‌చాల్సిన బాధ్య‌త నాపై అంతే ఉంటుంది. అందుకే త‌న పాత్ర వ‌ర‌కూ ప్రేక్ష‌కుల్ని ఎప్పుడూ సంతోషంగా థియేట‌ర్ నుంచి పంపించ‌డానికి త‌న వంతు కృషి చేస్తానంది. ఈ ఇరానియ‌న్ మోడ‌ల్ `హ‌లో చార్లీ` సినిమాతో బాలీవుఎడ్ లో లాంచ్ అయింది. ఆ త‌ర్వాత `జగ్ జగ్ జీయో`, `రాష్ట్ర కవచ్ ఓం` లాంటి చిత్రాల్లో న‌టించింది. మ‌రాఠీ, పంజాబీ చిత్రాల్లోనూ న‌టించింది. టెలివిజ‌న్ పైనా త‌న‌దైన ముద్ర వేసింది. `డెవిల్ :ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్` అనే తెలుగు సినిమాలోనూ న‌టించింది.

Tags:    

Similar News