బుల్లితెర క్వీన్ ఏక్తా మెచ్చిన ఐదుగురు మ‌హిళ‌లు

గునీత్ మోంగాతో కలిసి `కథల్` అనే చిత్రం తెర‌కెక్కించ‌గా ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.;

Update: 2025-09-30 02:30 GMT

బుల్లితెర టీఆర్పీ క్వీన్... మ‌హిళా గేమ్ ఛేంజ‌ర్... టెలివిజ‌న్ జార్నా.. పిలుపు ఏదైనా అందుకు అర్హ‌త ఒకే ఒక్క‌రికి ఉంది. అది బుల్లితెర క్వీన్ ఏక్తాక‌పూర్. టీవీ రంగంలో అదిరిపోయే టీఆర్పీల‌తో సంచ‌ల‌న షోల‌ను నిర్వ‌హించ‌డంలో ఏక్తాక‌పూర్ ని మించిన వారు లేరు. అదే స‌మ‌యంలో పెద్ద‌తెర‌పైనా మ‌హిళా నిర్మాత‌గా ఏక్తాక‌పూర్ బోల్డ్ గా ప్ర‌యోగాలు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే.

బుల్లితెర‌పై `క్యుంకీ సాస్ భీ కభీ బహు థి` నుండి `నాగిన్-7` వ‌ర‌కూ ఏక్తా చేయ‌ని ప్ర‌యోగం లేదు. బుల్లితెర వెండితెర రంగంలో మారుతున్న ట్రెండ్ గురించి ఏక్తా టైమ్స్ కాన్ క్లేవ్ లో మాట్లాడింది. ``క్వీన్ ఆఫ్ కంటెంట్: ఉమెన్ హూ షేప్డ్ ఇండియన్ స్క్రీన్స్` సెషన్‌లో మ‌హిళా నిర్మాత‌లు ఎలా కొత్త రూల్స్ తిర‌గ‌రాస్తున్నారో ఏక్తా వెల్ల‌డించారు. వినోద‌రంగంలో ఐదుగురు ఉత్త‌మ స‌మ‌కాలీన మ‌హిళ‌ల గురించి చెప్పాల్సిందిగా ఏక్తాను కోర‌గా, గుణీత్ మోంగా, రియా కపూర్, జోయా అక్తర్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ ఖాన్ అని చెప్పింది.

గునీత్ మోంగాతో కలిసి `కథల్` అనే చిత్రం తెర‌కెక్కించ‌గా ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. రియా కపూర్ తో `క్రూ`, థాంక్యూ చిత్రాల‌కు ఏక్తా ప‌ని చేసింది. కరీనాతో కలిసి `క్రూ`, `బకింగ్‌హామ్ మర్డర్స్` చిత్రాల‌కు సహ నిర్మాతగా చేసింది.. కానీ ఇంకా జోయా అక్త‌ర్, దీపికతో కలిసి పని చేయలేదు. భ‌విష్య‌త్‌లో క‌లిసి ప‌ని చేసేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిపింది.

సెన్సార్ బోర్డ్ గురించి అభిప్రాయం చెబుతూ... `చాలా అవ‌స‌ర‌మైన ఇబ్బంది!` అని వ్యాఖ్యానించింది. బుల్లితెర, వెండితెర వినోదంలో సినిమాల‌ను చంప‌డం అంటే ఏమిటో కూడా నిర్వ‌చ‌నం ఇచ్చింది. సినిమా టీవీ రంగాన్ని చంప‌డానికి కార‌ణం ..తార‌ల సిబ్బంది ఖ‌ర్చుల‌ను నిర్మాత‌లు మోయ‌డం అని కూడా ఏక్తా చెప్పింది. బుల్లితెర‌కు సిటీ ప్రేక్ష‌కులు లేర‌ని, యువత డిజిటల్‌కు దూరమయ్యారని కూడా ఏక్తా పేర్కొన్నారు. ఓటీటీలు, సినిమాల వల్ల బుల్లితెర‌ మాధ్యమానికి ముప్పు లేదని కూడా ఏక్తా వెల్ల‌డించింది. టీఆర్పీ రేసు గతానికి సంబంధించినదని ఏక్తా కూడా ఒప్పుకుంది. ఏక్తా జీవితాన్ని ఎప్పుడైనా టీవీ సిరీస్‌గా మార్చాల్సి వస్తే? అన్న ప్ర‌శ్న‌కు... `కసౌతి జిందగీ కే` అని టైటిల్ పెడ‌తాన‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ఏక్తా కపూర్ త్వరలో కలర్స్ టీవీలో `నాగిన్` ఏడవ భాగాన్ని ప్రారంభించనుంది.

Tags:    

Similar News