DQ41 కీలక షెడ్యూల్ పూర్తి.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన యూనిట్!

దుల్కర్ సల్మాన్.. మలయాళం సినీ నటుడే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో తెలుగులో నేరుగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు హీరోగా స్థిరపడిపోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి

Update: 2026-05-24 06:53 GMT

దుల్కర్ సల్మాన్.. మలయాళం సినీ నటుడే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో తెలుగులో నేరుగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు హీరోగా స్థిరపడిపోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకటి తర్వాత మరొకటి తెలుగులో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తొలిసారి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈయన ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం అనే తెలుగు చిత్రాన్ని చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు.




ఈ సినిమాతో అత్యధిక కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించారు. ఇక అప్పటినుంచి లక్కీ భాస్కర్ తో పాటు మరికొన్ని చిత్రాలు తెలుగులో చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన తాజాగా DQ41 అనే వర్కింగ్ టైటిల్ తో మరో సినిమా చేస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా ప్రకటించినప్పటికీ కాస్త ఆలస్యంగానే షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.




తెర వెనుక విషయాలు పంచుకున్న చిత్ర బృందం..

ఇక పూజా కార్యక్రమాలకు సంబంధించిన పలు విషయాలను వీడియోల రూపంలో పంచుకున్న చిత్ర బృందం ఎక్కడా కూడా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను అభిమానులతో పంచుకోలేదు . దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా తాజాగా ఈ సినిమా కీలక షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు తెలపడమే కాకుండా తెర వెనుక విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..




రొమాంటిక్ డ్రామాగా దుల్కర్, పూజా హెగ్డే కొత్త మూవీ..

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ ఇది. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జగపతిబాబు, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తుండగా.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. రవి బాబు నీలకుడితి తొలి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ ను తాజాగా పూర్తి చేశారు . సిక్కిం లోని రమణీయమైన కొండ ప్రాంతాలలో ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను చిత్రబృందం తాజాగా పూర్తి చేసింది . ఈ మేరకు ఈ షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు అధికారికంగా సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది.

కీలక షెడ్యూల్ పూర్తి..

ఇక సిక్కిం లోని కొండ ప్రాంతాలు.. అందమైన రంగురంగుల వంతెనల మీద హీరో, హీరోయిన్ జాకెట్ వేసుకొని ఈ సమ్మర్ వేళ .. అక్కడి చలి గాలులను ఆస్వాదిస్తూ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఫోటోలను పంచుకున్నారు. ఇక షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం కలిసి ఒక ఫోటో దిగగా.. ఆ ఫోటోలను నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా షేర్ చేసింది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ని ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు అధికారిక టైటిల్ తో పాటు పూర్తి టీజర్ ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇక సిక్కిం అందాలలో రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రేమ కథ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News