ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మక చిత్రాలు!
కాలానికి తగ్గట్టు మారుతున్న ప్రేక్షకుల రుచిని గమనిస్తూ దర్శకులు కూడా ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రేమ కథలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ఒకే రకమైన రొమాంటిక్ కథలకే పరిమితం కాకుండా విభిన్నమైన .. ప్రయోగాత్మక కాన్సెప్ట్‌లతో ప్రయాణించడానికి మేకర్స్ ముందుంటారు. రియల్ లైఫ్‌లో వయసు తేడా (ఏజ్ గ్యాప్) అనేది చర్చనీయాంశంగానే కాకుండా.. ఇప్పుడు వెండితెరపై సాలిడ్ లవ్ స్టోరీ జానర్‌గా మారుతోందన్నది కాదనలేని నిజం. కాలానికి తగ్గట్టు మారుతున్న ప్రేక్షకుల రుచిని గమనిస్తూ దర్శకులు కూడా ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో సరికొత్త ప్రేమ కథలను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్‌కు తార్కాణంగా టాలీవుడ్‌లో రెండు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సూర్య - మమితా బైజు జంటగా నటిస్తున్న `విశ్వనాథ్ అండ్ సన్స్` సినిమా ఈ జాబితాలో ముందుంది. 40 ఏళ్ళు దాటిన వ్యక్తి - 25 ఏళ్ల యువతి మధ్య చిగురించే ప్రేమకథాంశంతో ఈ చిత్రం రూపొందుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే కోవలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార .. యంగ్ హీరో కవిన్ జంటగా నటిస్తున్న `హాయ్` సినిమా కూడా ఇదే ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వయసులో పెద్దదైన మహిళ .. యువకుడి మధ్య జరిగే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న రోమ్-కామ్ చిత్రంపై యువతలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వయసు తేడా ఉన్న ఈ తరహా సబ్జెక్ట్‌లను తెరకెక్కించడం ఆషామాషీ విషయం కాదు. ఏ మాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ దానిని రిసీవ్ చేసుకోవడం కష్టమవుతుంది. కానీ దర్శకులు ఈ సున్నితమైన పాయింట్‌ను ఎమోషనల్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో డీల్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి రిలేషన్‌షిప్‌లపై జరుగుతోన్న చర్చలను వెండితెరపైకి తీసుకురావడం ద్వారా బోల్డ్ .. రియలిస్టిక్ అప్రోచ్‌ను ప్రదర్శిస్తున్నారు.
తెలుగు తెరపై ఈ కాన్సెప్ట్ పూర్తిగా కొత్తేమీ కాదు. గతంలో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమా ఇదే ఏజ్ గ్యాప్ అండ్ డిఫరెంట్ మైండ్‌సెట్ పాయింట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. మెచ్యూర్డ్ ఉమెన్ .. యంగ్ బాయ్ మధ్య ఉండే ఎంటర్‌టైనింగ్ బాండింగ్‌ను ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సక్సెస్ ఇచ్చిన ధైర్యంతోనే మరికొన్ని చిత్రాలు ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయి.
అంతిమంగా కమర్షియల్ హంగులకు అతీతంగా రియల్ లైఫ్ రిలేషన్స్‌పై వస్తున్న ఏజ్ గ్యాప్ ప్రయోగాత్మక చిత్రాలు తెలుగు సినిమా పరిధిని మరింత విస్తృతం చేస్తున్నాయి. ఆగస్టు లో విడుదల కానున్న ఈ తరహా సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.