తెలుగు కొత్త‌ కుర్రాడితో దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమా!

మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-12 00:30 GMT

మాలీవుడ్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. చేసిన సినిమా బంగార‌మే అవుతుంది. 'ల‌క్కీ భాస్క‌ర్' తో టాలీవుడ్ లో దుల్క‌ర్ క్రేజ్ రెట్టింపు అయింది. దీంతో మ‌రిన్ని తెలుగు సినిమాలు క‌మిట్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వంలో  'ఆకాశంలో ఒక తార' చిత్రం చేస్తున్నాడు. ఈసినిమాపై అంచ‌నాలు బాగున్నాయి. ప‌వ‌న్ సాదినేని కి ద‌ర్శ‌కుడిగా మంచి పేరుంది. అత‌డి సినిమాలు మినిమంగా ఆడేస్తుంటాయి. ఇంత వర‌కూ ప‌వ‌న్ సినిమాలు వైఫ‌ల్యం చెందింది లేదు.

ఈ నేప‌థ్యంలో దుల్క‌ర్ ప్రాజెక్ట్ మ‌రింత క్రేజీగా ఉంటుంద‌ని అంచ‌నాలున్నాయి. అటు కోలీవుడ్ లో 'కాంత' అనే చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఇలా రెండు భాష‌ల్లోనూ దుల్క‌ర్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగులో మ‌రో కొత్త ప్రాజెక్ట్ ఒకే చేసాడు. ర‌వి అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ ఎల్ వీసీ సంస్థ నిర్మించ‌డానికి ముందుకొస్తుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టులో చిత్ర ప్రారంభోత్స‌వం ఉంటుంద‌ని స‌మాచారం.

దుల్క‌ర్ శైలికి త‌గ్గ‌ట్టు ఓ వినూత్న‌మైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందంటున్నారు. ఎలాంటి అనుభ‌వం లేని కొత్త కుర్రాడికి దుల్క‌ర్ అవ‌కాశం ఇవ్వ‌డం అన్న‌ది గొప్ప విష‌యం. సాధార‌ణంగా ఈ రేంజ్ హీరోలు కొత్త హీరోల‌తో సినిమా చేయాలంటే ఆలోచిస్తారు. అదీ డెబ్యూ కి అవ‌కాశం ఇవ్వాలంటే స‌వాల్ తో కూడిన ప‌నే. అలాంటి సాహ‌సం కొంద‌రే చేయ‌గ‌ల‌రు. అందులో దుల్క‌ర్ కూడా చేరారు. మాలీవుడ్ లో కూడా కొత్త వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాలు చేయ‌డం దుల్క‌ర్ కే చెల్లింది.

అందుకే తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో ఎదిగాడు. డాడ్ మ‌మ్ముట్టి త‌ర‌హాలో ఏడాదికి నాలుగు సినిమాలైనా రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. కానీ స‌రైన క‌థ‌లు, ద‌ర్శ‌కులు కుద‌ర‌క‌పోవ‌డంతో సాధ్యప‌డ‌లేదు. ఒకే బంగారం, సీతారామం సినిమాల‌తో దుల్క‌ర్ తెలుగింట ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. అటుపై రిలీజ్ అయిన ల‌క్కీ భాస్క‌ర్ తో తెలుగు న‌టుడిగా అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News