'డ్యూడ్' దీపావళి దండయాత్ర.. 3 రోజుల లెక్క ఇదే!

దీపావళి పండగ సెలవులు కావడంతో, సినిమా బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.;

Update: 2025-10-20 11:38 GMT

ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడే నెలకొంది. ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి నాలుగు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చాయి. వేటికవే ప్రమోషన్ కంటెంట్ లో బాగానే హైలెట్ అయ్యాయి. ఇక పోటీ గట్టిగా ఉన్నా, ఒక సినిమా మాత్రం ఈ పండగ సీజన్‌ను పూర్తిగా తనవైపు తిప్పుకున్నట్లు కనిపిస్తోందని మేకర్స్ ప్రకటించారు. యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన చిత్రమే ఈ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది.

 

కోలీవుడ్‌లో వరుస హిట్ల తర్వాత, ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' చిత్రాన్ని టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా సంస్థ విడుదల చేసింది. మొదటి రోజు నుంచే సినిమాకు మంచి వసూళ్లు వస్తుండగా, ఇప్పుడు మూడు రోజుల వీకెండ్ ముగిసేసరికి చిత్రయూనిట్ అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్, సినిమా ఏ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తుందో చూపిస్తోంది.

మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్ ప్రకారం, 'డ్యూడ్' మూవీ మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో, ఈ దీపావళి వీకెండ్‌కు తమ సినిమానే స్పష్టమైన విన్నర్‌గా నిలిచిందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇది ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ వీకెండ్ గ్రాసర్‌గా నిలవడం విశేషం.

ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా Gen-Z బాగా కనెక్ట్ అవుతున్నారని టీమ్ చెబుతోంది. ప్రదీప్ మార్క్ యాక్టింగ్, సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. మొదటి మూడు రోజులే ఈ స్థాయిలో ఉంటే, ఇక అసలైన పండగ రోజుల్లో వసూళ్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

దీపావళి పండగ సెలవులు కావడంతో, సినిమా బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సెలవుల అడ్వాంటేజ్‌తో 'డ్యూడ్' వసూళ్లు మరింత పెరిగి, ప్రదీప్ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, మైత్రీ మూవీ మేకర్స్ ఒక యంగ్ హీరోను, కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్‌ను నమ్మి, పర్ఫెక్ట్ టైమింగ్‌లో సినిమాను విడుదల చేసి, పండగ సీజన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ హాలిడే రన్ ముగిసేసరికి 'డ్యూడ్' ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News