పురాణాల‌ను ఎక్కువ‌గా చ‌ద‌వ‌మంటున్న డైరెక్ట‌ర్

ఒక సినిమాను స‌రిగ్గా తెర‌కెక్కించ‌డంలో క‌థ‌లోని ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణ‌, అందులో ఉండే సారాంశం, ట్రీట్‌మెంట్ ఎలాంటి కీల‌క పాత్ర‌లు పోషిస్తాయో కూడా క‌న్న‌న్ చెప్పారు.;

Update: 2025-10-15 13:30 GMT

ప్రముఖ స్క్రీన్ రైట‌ర్, సినీ డైరెక్ట‌ర్ డిఎస్ క‌న్న‌న్ అంద‌రికీ సుప‌రిచితులే. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి లాంటి అగ్ర డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి వ‌ర్క్ చేసిన క‌న్న‌న్, హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్టూడెంట్స్ కోసం ఓ మాస్ట‌ర్ క్లాస్ ను నిర్వ‌హించారు. ఈ సెష‌న్ లో ఆయ‌న స్క్రీన్ ప్లే రైటింగ్, క్యారెక్ట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ పై దృష్టి సారించారు.

 

స్క్రీన్‌ప్లే పైనే ఫోక‌స్

వ‌ర్క్ షాప్ లో క‌న్న‌న్, ఆడియ‌న్స్ యాంగిల్ నుంచి స్క్రీన్ ప్లే మ‌రియు ఫండ‌మెంట‌ల్ కాన్సెప్ట్ ల‌పై దృష్టి సారించారు. భారతీయ పురాణాలు, జాన‌ప‌ద క‌థ‌ల‌ను ఉప‌యోగించుకుని సావిత్రి, స‌త్యావాన్ లాంటి క‌థ‌ల‌ను రోజా లాంటి సినిమాలతో అనుసంధానించారు. దాంతో పాటూ కాల ప‌ర‌మితుల‌కు అనుగుణంగా క‌థ‌న వేగాన్ని, పిచ్‌ల‌ను ఎలా రూపొందించాలో కూడా ఆయ‌న స్టూడెంట్స్ కు అర్థ‌మ‌య్యేలా చెప్పారు.

హీరో ఆధారిత క్యారెక్ట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ పై డిస్క‌ష‌న్స్

ఒక సినిమాను స‌రిగ్గా తెర‌కెక్కించ‌డంలో క‌థ‌లోని ప్ర‌ధాన సంఘ‌ర్ష‌ణ‌, అందులో ఉండే సారాంశం, ట్రీట్‌మెంట్ ఎలాంటి కీల‌క పాత్ర‌లు పోషిస్తాయో కూడా క‌న్న‌న్ చెప్పారు. అయితే ఈ మాస్ట‌ర్ క్లాస్ లో ఎక్కువ‌గా హీరో ఆధారిత క్యారెక్ట‌ర్ల‌ను ఎలా డెవ‌ల‌ప్ చేయాలి, ఎలాంటి మేన‌రిజ‌మ్స్ ను ఆ పాత్ర‌ల‌కు పెట్టాలి లాంటి విష‌యాల‌పైనే చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా యాక్ష‌న్ సీన్స్ ను రూపొందించ‌డంలో త‌న నైపుణ్యాన్ని కూడా షేర్ చేసుకున్నారు క‌న్న‌న్. ప్ర‌తీ సీన్ కు ముందు, సీన్ కు త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెలియ‌చేయ‌డానికి ఒక ప్లాన్ ను ఫాలో అవాల‌ని చెప్పిన ఆయ‌న‌, వ‌ర్క్ షాప్ సెకండాఫ్ లో నిర్మాత‌ల‌కు సినిమా తీసే టైమ్ లో యాక్ట‌ర్లు మరియు మిగిలిన వారితో డిస్క‌ష‌న్స్ చేయ‌డంపై స‌ల‌హాల‌ను కూడా ఇచ్చారు.

ఇదే సెషన్ లో స్క్రీన్ రైటింగ్ ప్రాసెస్ లో సాహిత్యం యొక్క ప్రాముఖ్య‌త‌ను క‌న్న‌న్ తెలియ‌చేశారు. సినీ ఇండ‌స్ట్రీలో ఉండాల‌నుకునే వాళ్లు త‌మ క‌థ‌ను బాగా రాసుకోవ‌డానికి పురాణాల‌ను ఎక్కువ‌గా చ‌ద‌వ‌మ‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు, స్క్రీన్ రైట‌ర్లు కావాల‌నే వారికి ఆయ‌న మ‌రో స‌ల‌హా కూడా ఇచ్చారు. రియ‌ల్ లైఫ్ ప‌రిశీల‌న‌ల‌ను క్యాప్చ‌ర్ చేయ‌డానికి ఓ డైరీని మెయిన్‌టెయిన్ చేస్తూ, వీలైన‌ప్పుడు ఆ అనుభవాల‌ను సినిమాల్లో సబ్‌ప్లాట్స్ గా వాడుకుంటే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Tags:    

Similar News