అంతకు మించి ప్లాన్ చేస్తున్న జీతూ
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ సూపర్‌హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.;
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ సూపర్‌హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా 2013లో వచ్చిన దృశ్యం మొదటి భాగమైతే వేరే భాషల్లో కూడా రీమేక్ అయి, రీమేక్ అయిన ప్రతీ భాషలోనూ ఊహించని విజయాన్ని అందుకుంది. దృశ్యం సినిమాతోనే జీతూ జోసెఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
సూపర్ హిట్ ఫ్రాంచైజ్‌గా దృశ్యం
ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు రాగా ఇప్పుడు మూడో భాగం కోసం రంగం సిద్ధమవుతుంది. దృశ్యం2లోనే మూడో భాగం కూడా ఉంటుందని చెప్పిన మేకర్స్ ఆల్రెడీ దృశ్యం3 సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. మొదటి రెండు భాగాలను మించిన క్రైమ్ థ్రిల్లర్ గా జీతూ దృశ్యం3ను తెరకెక్కించనున్నారని ఆయన సన్నిహితులంటున్నారు.
దృశ్యం3కి రంగం సిద్ధం
అయితే ఇప్పుడు దృశ్యం3 షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతుంది చిత్ర యూనిట్. దృశ్యం మలయాళ వెర్షన్ షూటింగ్ సెప్టెంబర్ 17న ప్రారంభించి, నవంబర్ 10 నాటికి ముగించనున్నారు. ఆ తర్వాత వెంటనే తెలుగు వెర్షన్ ను నవంబర్ మధ్యలో మొదలుపెట్టనున్నారని, అది పూర్తవగానే హిందీ వెర్షన్ 2026 స్టార్టింగ్ లో ప్రారంభించాలని జీతూ జోసెఫ్ ప్లాన్ చేస్తున్నారట.
దృశ్యం3పై భారీ అంచనాలు
ఈ దృశ్యం ఫ్రాంచైజ్ సినిమాలకు కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ముందు మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాలు ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ హీరోగా, బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన ప్రతీ భాషలోనూ దృశ్యం మంచి విజయం సాధించడంతో ఈ ఫ్రాంచైజ్ పై అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి.