దృశ్యం ప్లాన్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే..
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ప్రాంచైజీ దృశ్యం దక్షిణాది భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.;
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ప్రాంచైజీ దృశ్యం దక్షిణాది భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఆ సిరీస్.. సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మోహన్ లాల్, మీనా కాంబినేషన్ దృశ్యం సిరీస్ సినిమాలకు మరింత బలం ఇచ్చింది.
ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు దృశ్యం 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మూడో భాగాన్ని అధికారికంగా 2025 సెప్టెంబర్ లో ప్రారంభించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా దర్శకుడు జీతూ జోసెఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దృశ్యం అనేది ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే కథ అని, ఎలాంటి భారీ అంచనాలు పెట్టుకోకుండా చూసినా థ్రిల్ ఫీలయ్యేలా ఉంటుందని తెలిపారు. అలాగే దృశ్యం 3ను 2026 మేలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగా వేసిన ఒక ప్లాన్ మాత్రం అనుకున్న విధంగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.
అదే దృశ్యం 2 రీ రిలీజ్ ప్లాన్. ఇటీవలి కాలంలో పలు సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదల చేసి మంచి కలెక్షన్లు సాధిస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ దృశ్యం 2ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 10న ఆ సినిమాను రీరిలీజ్ చేశారు. కానీ ఆ నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
మేకర్స్ ట్రెండ్ ను ఫాలో అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఫలితంగా దృశ్యం 2 రీరిలీజ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. సమాచారం ప్రకారం.. ఆ చిత్రం 5 లక్షల రూపాయల కంటే తక్కువ వసూళ్లు మాత్రమే సాధించింది. థియేట్రికల్ ఖర్చులు, రెంటల్ ఖర్చులు కూడా రికవరీ కాలేక పోయినట్లు తెలుస్తోంది. ఇది చూస్తే, మేకర్స్ వేసిన ప్లాన్ బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది.
నిజానికి దృశ్యం 2.. 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీలో రిలీజవ్వగా.. డిజిటల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి భాగం విజయంతో వచ్చిన క్రేజ్ పెద్ద ప్లస్ అయింది. కానీ రీరిలీజ్ లో మాత్రం నిరాశపరిచింది. ఒకప్పుడు ఓటీటీ వేదికగా సంచలన విజయం సాధించిన సినిమా, ఇప్పుడు థియేటర్లలో అదే మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. మొత్తానికి దృశ్యం 3పై ఉన్న హైప్ మధ్య, దృశ్యం 2 రీరిలీజ్ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు అందరి దృష్టి దృశ్యం 3పైనే నిలిచింది. మరి ఆ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.