లెజెండరీ నటుడి రెండో భార్య ఎందుకు కలిసి లేరు?
వాస్తవానికి ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్. 43 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రకాష్ కౌర్‌తో విడాకులు తీసుకోకుండానే డ్రీమ్ గర్ల్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న ధర్మేంద్రపై హేమమాలిని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.;
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర అనారోగ్యం అభిమానుల్లో కలతను పెంచుతోంది. ఆయన కోలుకున్నారనే వార్త ఆనందం నింపినా, ఇదే సమయంలో ఆయన గతం గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ధర్మేంద్ర అసాధారణ ఛరిష్మా, ప్రతిభ గురించి, ఆయన ఇద్దరు భార్యల ముద్దుల ప్రియుడు అనే విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి డ్రీమ్ గర్ల్ హేమమాలిని అతడికి రెండవ భార్య. కొద్ది రోజుల క్రితం అతడితో తన సంబంధం గురించి హేమమాలిని మీడియాతో ముచ్చటించారు. తమకు వివాహం అయినా ఎందుకు కలిసి జీవించలేదు? అనేదానిపై 74 ఏళ్ల సీనియర్ నటి మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు రెండో పెళ్లి వ్యక్తితో సంబంధాన్ని అంగీకరించలేదని తెలిపారు.
``ఇది జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ అది జరుగుతుందని అంగీకరించి ముందుకు సాగాలి. కాకపోతే ఒకరు తమ జీవితాన్ని ఎలా గడపాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రతి స్త్రీ ఒక సాధారణ కుటుంబం వలె భర్త పిల్లలను కోరుకుంటుంది. కానీ అప్పుడప్పుడు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు`` అని హేమమాలిని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తన గురించి తనకు భయం లేదని ఇద్దరు పిల్లలను చక్కగా పెంచానని హేమ చెప్పారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ధర్మేంద్ర అన్ని సమయాల్లో మాతో ఉన్నారు. ఆయనకు దూరంగా వేరే ఇంట్లో నివసించడం తప్పదు. నేను దానికి బాధపడలేదని డ్రీమ్ గర్ల్ నిజాన్ని ఒప్పుకున్నారు.
వాస్తవానికి ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్. 43 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రకాష్ కౌర్‌తో విడాకులు తీసుకోకుండానే డ్రీమ్ గర్ల్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న ధర్మేంద్రపై హేమమాలిని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ధర్మేంద్ర తన మాజీ భార్య ఆమె కుటుంబంతో నివసిస్తున్నారు.
హేమ మాలిని తల్లి జయ చక్రవర్తి తన కుమార్తెను హీరో జితేంద్రతో పెళ్లికి ఒప్పించారనేది చరిత్ర. హేమ మాలిని తన జీవిత చరిత్రలో `హేమ మాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్`లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. హేమ - జితేంద్ర రహస్య వివాహం కోసం చెన్నైకి వెళ్లిన విషయాన్ని పత్రికలు లీక్ చేసాయి. జితేంద్ర అప్పటి ప్రియురాలు, ఇప్పటి పెళ్లయిన శోభతో కలిసి ధర్మేంద్ర చెన్నైలో జితేంద్రకు షాకిచ్చారు. దీంతో జితేంద్ర- శోభ తిరిగి ఒకటయ్యారు. ఈ జంట వ్యక్తిగతంగా వారి కుటుంబాలను కలుసుకున్నారు. దీంతో హేమమాలిని- జితేంద్ర పెళ్లి క్యాన్సిలైంది.
ఆ తర్వాత 2 మే 1980న ఇరుకుటుంబాలు వ్యతిరేతను ఎదుర్కొన్నా కానీ.. హేమ మాలిని- ధర్మేంద్ర అందరినీ ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇషా డియోల్ - అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 89 ఏళ్ల వయస్సులో ఉన్న ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ తో ఖండాలా లోని 100 ఎకరాల ఫామ్ హౌస్ లో నివశిస్తున్నారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్, అజీతా డియోల్ అనే నలుగురు సంతానం ఉన్నారు.