• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజన్...

ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజన్ లో పెట్టిన ఎన్టీఆర్..?

| ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.

By - Ramesh Boddu
Update: 2025-11-07 09:30 GMT

ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అయితే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ నటించడం సినిమాకు మరో హైలెట్ అయ్యేలా ఉంది. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రుక్మిణి హడావిడి కనిపిస్తుంది. కాంతారా చాప్టర్ 1 లో ఆమె లుక్స్ అదిరిపోయాయి. అందుకే డ్రాగన్ కి అమ్మడు కలిసి వచ్చే అంశం అయ్యేలా ఉంది.

ఎన్టీఆర్ ఈ రెండు పార్ట్ లను ఒకేసారి..

ఇక డ్రాగన్ సినిమాను రెండు భాగాలుగా చేస్తారనే టాక్ ఉంది. ఎన్టీఆర్ ఈ రెండు పార్ట్ లను ఒకేసారి ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరు చాలా పెద్ద స్కెచ్ తోనే వస్తున్నారట. డ్రాగన్ రెండు భాగాలు చాలా తక్కువ టైంలోనే రిలీజ్ చేసేలా చూస్తున్నారట. ఐతే డ్రాగన్ 2 కోసం తొందరపడుతున్న తారక్ దేవర 2 ని మర్చిపోయాడా ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 1 అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోయినా ఓకే అనిపించుకుంది. ఐతే ఇప్పుడు డ్రాగన్ 2 అంటున్నారు.. మరి దేవర 2 పరిస్థితి ఏంటంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఐతే డ్రాగన్ మొదటి రెండు పార్ట్ లకు సంబందించి ఒకేసారి పని పూర్తి చేస్తున్నాడట ఎన్టీఆర్. కేవలం పార్ట్ 1 రిలీజై సూపర్ హిట్ అయితే అదే వేడి మీద ఏమాత్రం లేట్ చేయకుండా డ్రాగన్ 2 వదులుతారట.

డ్రాగన్ 2 తర్వాతే దేవర 2..

ఐతే దేవర 2 ని డ్రాగన్ 2 తర్వాతే చేసేలా తారక్ ప్లానింగ్ ఉందట. ఈలోగా కొరటాల శివ సినిమాకు సంబందించిన అన్ని పనులను పూర్తి చేసేలా చూస్తున్నారట. దేవర 2 తో ఎలాగైనా ఈసారి ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా చేయాలని కొరటాల శివ ఫోకస్ చేస్తున్నారట. డ్రాగన్ 2 వచ్చిన తర్వాత వెంటనే దేవర 2 కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లి అది కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దేవర 2, డ్రాగన్ 2 ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ అందిస్తాయని అంటున్నారు. మరి ఈ ప్లానింగ్ లో ఏది ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ మాత్రం సలార్ 1 ని మించి ఉండేలా చూస్తున్నారట. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఛరిష్మాని పర్ఫెక్ట్ గా వాడుకునేలా డైరెక్టర్ ప్లానింగ్ ఉందట. ఈ సినిమాతో కచ్చితంగా బాక్సాఫీస్ లు షేక్ అవుతాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Tags:    
  • jrntr 
  • devara2 
  • koratalasiva 
  • tollywood 
  • filmindustry 
  • devara 
  • ntrneel 
  • prashanthneel 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS