• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి కోసం కుర్ర హీరో.....

కల్కి కోసం కుర్ర హీరో.. స్పెషల్ రోల్?

| సినిమాలో దుల్కర్ సల్మాన్ ఈ ఇంట్రస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడంట. ఆయన పాత్రలో మూవీలో సెకండ్ హాఫ్ లో 10 నిమిషాలు ఉంటుందంట.

By - Tupaki Desk
Update: 2023-08-16 04:43 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో సిద్ధమవుతోన్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. మైథలాజికల్ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ని ఫ్యూచర్ కి అన్వయించుకొని హిందూ పురాణ కథల ఆధారంగా ఫిక్షనల్ స్టోరీ సిద్ధం చేసుకొని కల్కి 2898 ఏడీ మూవీని దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు.

ఈ చిత్రంలో అమితాబచ్చన్ పరశురాముడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ప్రతినాయకుడిగా కలిపురుషుడు పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషలలో ఇండియా నుంచి రిలీజ్ కాబోతోన్న మూవీ కూడా ఇదే కావడం విశేషం. ఇంగ్లీష్, చైనా భాషలలో కూడా మూవీని ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది.

సినిమాలో దుల్కర్ సల్మాన్ ఈ ఇంట్రస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడంట. ఆయన పాత్రలో మూవీలో సెకండ్ హాఫ్ లో 10 నిమిషాలు ఉంటుందంట. దుల్కర్ సల్మాన్ తెలుగులో చేసిన రెండు సినిమాలు వైజయంతీ మూవీస్ బ్యానర్ లో చేసినవే. ఈ కారణంగా వారితో మంచి అనుబంధం ఉంది. అలాగే దుల్కర్ తో మరోసినిమా చేయడానికి కూడా వైజయంతీ ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్.

ఈ నేపథ్యంలోనే కల్కి సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ రోల్ కోసం అతనిని సంప్రదించారట. దుల్కర్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒకే చెప్పేసాడని ప్రచారం నడుస్తోంది. కథలో భాగంగా వచ్చే దుల్కర్ పాత్ర కూడా దైవంతో ముడిపడి ఉంటుందంట. భూమిపై ఉన్న చిరంజీవులులో ఒకడుగా దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో కనిపిస్తాడని జోరుగా టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవమెంత అనేది చూడాలి.

Tags:    
  • Kalki 
  • Prabhas 
  • Nagashwin 
  • Vyjayanthimovies 
  • Kamalhassan 
  • Amitabbachchan 
  • Deepikapadukone 
  • Panindia 
  • Dulquersalman 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS