• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'డబుల్ ఇస్మార్ట్'...

'డబుల్ ఇస్మార్ట్' సెన్సార్ రిపోర్ట్.. పూరీ ఈజ్ బ్యాక్!

| ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ, సక్సెస్ ఫుల్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-08-08 08:12 GMT

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం "డబుల్ ఇస్మార్ట్". ఇది 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' కు సీక్వెల్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ లభించింది. రీసెంట్ గా వదిలిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ, సక్సెస్ ఫుల్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ టాక్ పాజిటివ్ గా వచ్చింది.

"డబుల్ ఇస్మార్ట్" చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' (ఎ) సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సులు, మదర్ సెంటిమెంట్, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయిందని చెబుతున్నారు. మాస్ అప్పీల్, ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ కలబోసి ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ శంకర్ గా రామ్ మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో అదరగొట్టాడని అంటున్నారు. బిగ్ బుల్ అనే పవర్ ఫుల్ క్యారక్టర్ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్‌ తన ఉనికిని చాటుకున్నారు. వీరిద్దరూ ముఖాముఖి తలపడే సన్నివేశాలు హైలైట్‌గా వచ్చాయని టాక్. హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. రామ్ - కావ్య మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ఈ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. ఇప్పటికే సాంగ్స్ తో ఆకట్టుకున్న మణిశర్మ.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తోనూ తన మార్క్ చూపించారని తెలుస్తోంది.

ఓవరాల్ గా 'డబుల్ ఇస్మార్ట్' మూవీ డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ను డబుల్ మ్యాడ్ నెస్ ను అందిస్తుందని సెన్సార్ రిపోర్ట్ ను బట్టి అర్థమవుతోంది. ఇదే జరిగితే రామ్ - పూరీలు టాలీవుడ్ లో మరో సక్సెస్ ఫుల్ హీరో డైరెక్టర్ కాంబినేషన్ గా నిలిచే అవకాశం ఉంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది. ఇప్పటికే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం స్వాతంత్ర్య దినోత్సవం, సోమవారం రక్షా బంధన్ సెలవులతో కలిసి 5 రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు ప్రీ-రిలీజ్ రిపోర్టులు పాజిటివ్ గా రావడం, పూరీ ఈజ్ బ్యాక్ అంటున్నారు కాబట్టి, 'డబుల్ ఇస్మార్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Double Ismart Run Time 2 hrs 42 Mins

Censor Talk : Positive

Censor Certificate: U/A

Hit Loading For Puri Jagannath, Ram Pothineni 💥#DoubleiSmart pic.twitter.com/6QXfei2A3V

— News Wala Filmy (@NewsWalaFilmy) August 8, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • DoubleiSmart 
  • RamPothineni 
  • Kavyathapar 
  • PuriJagannadh 
  • Acertificate 
  • CensorBoard 
  • PrimeshowEntertainment 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS