జాన్వీ స్థానాన్ని ఆమె రీప్లేస్ చేస్తుందా?
ఏది ఎవరికి రాసి పెట్టి ఉంటే వారికే దక్కుతుందని పెద్దలు ఊరికే అనలేదు. సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సింది మరొకరు చేయడం చాలానే జరిగాయి.;
ఏది ఎవరికి రాసి పెట్టి ఉంటే వారికే దక్కుతుందని పెద్దలు ఊరికే అనలేదు. సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సింది మరొకరు చేయడం చాలానే జరిగాయి. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు మరోసారి వచ్చింది. జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష ప్రధాన పాత్రల్లో దోస్తానా2 అనే సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ కొన్నేళ్ల కిందట అనౌన్స్ చేసింది. కొంత భాగం షూటింగ్ అయ్యాక అనివార్య కారణాలతో మరియు కోవిడ్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
స్క్రిప్ట్ లో మార్పులతో పాటూ క్యాస్టింగ్ లో కూడా..
అప్పట్నుంచి దోస్తానా2లో ఎన్నో మార్పులు జరుగుతూ రాగా, ఇప్పుడు తిరిగి ఆ సినిమా ట్రాక్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొదట్లో ఎన్నో ఆర్భాటాలతో మొదలైన దోస్తానా2 స్క్రిప్ట్ ను రీ రైట్ చేస్తున్నారని, స్క్రిప్ట్ లో మార్పులతో పాటూ మూవీ మెయిన్ క్యాస్టింగ్ లో కూడా మార్పులు చేస్తున్నట్టు మేకర్స్ ఈ ఏడాది మొదట్లో వెల్లడించారు.
కార్తీక్ ఆర్యన్, నిర్మాణ సంస్థ మధ్య విబేధాలు
దోస్తానా2 మెయిన్ క్యాస్టింగ్ ను మార్చి, మళ్లీ కొత్త క్యాస్టింగ్ తో రాబోతున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించగా, కార్తీక్ ఆర్యన్ మరియు నిర్మాణ సంస్థ మధ్య విబేధాలు తలెత్తాయి, అందుకే ఆయన్ను సినిమా నుంచి తప్పించారని వార్తలొచ్చాయి. అయితే అప్పటికే జాన్వీ కపూర్ 30- 35 రోజులు దోస్తానా2 కోసం వర్క్ చేసినప్పటికీ, రీక్యాస్టింగ్ అన్న తర్వాత ఆమె కూడా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.
జాన్వీ ప్లేస్ లో ప్రతిభా రంతా
అయితే దోస్తానా2 కోసం మేకర్స్ కొత్త క్యాస్టింగ్ ను వెతుకుతున్న నేపథ్యంలో జాన్వీ కపూర్ ప్లేస్ లో లాపాటా లేడీస్ లో నటించిన ప్రతిభా రంతాను ఫైనల్ చేశారని తెలుస్తోంది. లక్ష్య ఈ ప్రాజెక్టులో కొనసాగుతున్నప్పటికీ కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ మాత్రం దోస్తానా2 నుంచి తప్పుకున్నారు. కార్తీక్ ఆర్యన్ స్థానంలో విక్రాంత్ మాస్సేను తీసుకోగా, జాన్వీ ప్లేస్ లో ప్రతిభా రంతాను తీసుకున్నారని తెలుస్తోంది.
లేట్ అయిన లక్ష్య లాంచ్
ముందుగా ఈ పాత్ర కోసం శ్రీలీల పేరుని పరిశీలించినప్పటికీ ఆఖరికి ప్రతిభా రంతాను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. లాపాటా లేడీస్ లో తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న ప్రతిభా రంతా దోస్తానా2 సినిమాకు కొత్త ఉత్సాహాన్ని తెస్తోందని అందరూ భావిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని రీసెంట్ గానే కన్ఫర్మ్ చేశారు. 12th ఫెయిల్, ఎ డెత్ ఇన్ ది గంజ్, హసీన్ దిల్‌రూబా సినిమాల్లో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విక్రాంత్ మాస్సే, దోస్తానా2 కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు. ఇదిలా ఉంటే 2019లోనే ధర్మ ప్రొడక్షన్ లో లక్ష్య లాంచ్ కావాల్సింది. కానీ దోస్తానా2 సినిమా ఆగిపోవడంతో అది జరగలేదు. ఇప్పుడు దోస్తానా2 తిరిగి మొదలవుతున్న సందర్భంగా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న లక్ష్య లాంచ్ కూడా జరిగే అవకాశముంది.