US బాక్సాఫీస్.. ఈ 4 సినిమాలు అందుకుంటాయా?
దీపావళి పండుగ కానుకగా ఈ వీక్ లో మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కె- ర్యాంప్ సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;
దీపావళి పండుగ కానుకగా ఈ వీక్ లో మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కె- ర్యాంప్ సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నాలుగు చిత్రాలు కూడా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ విడుదల అయ్యాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
అయితే దివాళీకి వచ్చిన నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకోలేదని చెప్పాలి. మిక్స్ డ్ టాక్ మాత్రమే సంపాదించుకున్నాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు. కాబట్టి వీకెండ్ లో మంచి వసూళ్లు వస్తేనే కాస్త సేఫ్ జోన్ లో ఉంటాయి. మరి నాలుగు చిత్రాల పరిస్థితి ఎలా ఉందంటే? బ్రేక్ ఈవెన్ టార్గెట్లు ఎంత?
దీపావళి సందర్భంగా మొదటగా అక్టోబర్ 16వ తేదీన రిలీజ్ అయిన మిత్ర మండలి మూవీ.. అనుకున్నంత రేంజ్ లో ఓపెనింగ్స్ రాబట్టలేదు. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి కేవలం 47 వేల డాలర్స్ ను సాధించింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ $300,000గా తెలుస్తోంది. వీకెండ్ తో పాటు ఫుల్ రన్ లో ఆ మార్క్ అందుకుంటుందో లేదో మరి.
మిత్రమండలి తర్వాత డ్యూడ్, తెలుసు కదా సినిమా ఒకే రోజు అంటే అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ అయ్యాయి. అయితే తెలుసు కదా మూవీ.. ఓపెనింగ్స్ $187,000గా నమోదయ్యాయి. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం $1.5 మిలియన్లుగా ఉంది. దీంతో సినిమా ఇంకా భారీ వసూళ్లను సాధించాలి. లేకుంటే మాత్రం నష్టాలు తెచ్చేలా కనిపిస్తోంది.
నిన్న రిలీజ్ అయిన కె- ర్యాంప్ ఆడియన్స్ ను మిక్స్ డ్ టాక్ అందుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా.. కొన్ని సెంటర్స్ లో ఆడియన్స్ ను ఎక్కువగా మెప్పిస్తోంది. నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి ఇంకా లెక్కలు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో రివ్యూస్.. మిశ్రమంగా ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే పై మూడు సినిమాలు కన్నా ఉత్తర అమెరికాలో డ్యూడ్ మూవీ మాత్రం మెరుగైన ప్రదర్శనతో సందడి చేస్తోంది. ప్రీమియర్లు, మొదటి రోజు మొత్తం $330,000 వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ మార్క్ $2.3 మిలియన్లు కాగా.. అడ్వాన్స్ బుకింగ్స్ మోస్తరుగా జరుగుతున్నాయి. అవి ఇంకా పెరగాలంటే మేకర్స్ పోస్ట్ ప్రమోషన్స్ చేపట్టాలి. మరి నార్త్ అమెరికాలో దీపావళి సినిమాలు ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో.. బ్రేక్ ఈవెన్ అందుకుంటాయో లేదో చూడాలి.