బిగ్ బాస్ 9.. దివ్య డబల్ గేమ్ కానీ సీన్ రివర్స్..!
బిగ్ బాస్ సీజన్ 9లో వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ చేసిన తప్పొప్పులను రివ్యూ చేస్తూ ఆటలో వారిని ముందుకు దూసుకెళ్లేలా చేస్తాడు హోస్ట్ నాగార్జున.;
బిగ్ బాస్ సీజన్ 9లో వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ చేసిన తప్పొప్పులను రివ్యూ చేస్తూ ఆటలో వారిని ముందుకు దూసుకెళ్లేలా చేస్తాడు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలో హౌస్ మేట్స్ ఎవరైనా కావాలని ఒకరిని ఓడించాలని టార్గెట్ చేస్తే మాత్రం కచ్చితంగా వారి గురించి అందరికీ తెలిసేలా చేస్తాడు. లాస్ట్ వీక్ తనూజ కెప్టెన్ కాకుండా చేసిన దివ్య గురించి 3 వీడియోస్ చూపించి మరీ ఆమె ఆడిన డబల్ గేమ్ ని బయట పెట్టాడు నాగార్జున. ముందు ఆమెకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా భరణి సీట్ లో నుంచి లేపినా కూడా అది డౌట్ గా ఉంది అంటూ సుమన్ ని కన్విన్స్ చేసి ఎంచక్కా కళ్యాణ్ ని కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పించింది.
తనూజని కెప్టెన్ చేయకూడదు అని దివ్య..
ఆ వీడియోతో పాటు తనూజని కెప్టెన్ చేయకూడదు అని దివ్య గౌరవ్ తో మాట్లాడిన వీడియో కూడా ప్లే చేశారు. ఇలా దివ్య పర్సనల్ గానే తనూజని కెప్టెన్ కాకుండా వెనక ప్లాన్ వేసింది. అనుకున్నట్టుగానే కళ్యాణ్ దగ్గర నుంచి దివ్య చెయిర్ లాగేసుకుని తనూజని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించేసింది. ఐతే ఆ వీడియోస్ అన్నీ చూశాక సుమన్ కూడా దివ్య కావాలనే తనూజ ని కెప్టెన్ కాకుండా చేయాలని ఇదంతా చేసిందని చెప్పాడు.
ఆదివారం ఎపిసోడ్ లో దివ్య ఆడిన డబల్ గేమ్ ని చూపించి అది తన స్ట్రాటజీనే కానీ అది నువ్వు గెలవడానికి ఆడాలి కానీ మరొకరిని ఓడించడానికి కాదు అన్నట్టుగా నాగార్జున చెప్పారు. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇలా తన వీడియోస్ అన్నీ చూపించడంతో దివ్య కాస్త షాక్ అయ్యింది. తనూజ మీద తనకున్న ఒపీనియన్ ఏంటన్నది పూర్తిగా బయట పెడుతూ ఈ వీడియోస్ ప్లే చేశారు. తనూజ కూడా అసలు ఏం జరుగుతుంది అన్నది మరింత తెలుసుకునేలా ఇవి ఉపయోగపడ్డాయి.
దివ్య ఆల్రెడీ భరణి ఆట డిస్ట్రబ్..
దివ్య తనూజ మధ్య అసలు గొడవకి కారణం భరణి. ఆల్రెడీ తనూజకి దగ్గరైన భరణిని దివ్య ఎంట్రీ తర్వాత అతనికి దగ్గరైంది. బ్రదర్లీ రిలేషన్ షిప్ తో భరణితో ఆట ఆడుతున్న దివ్య ఆల్రెడీ అతని ఆట డిస్ట్రబ్ చేసింది. రీ ఎంట్రీ తర్వాత అయినా భరణిని తన ఆట ఆడనిస్తుంది అనుకుంటే ఆమె మళ్లీ భరణి తన కోసమే ఆట ఆడాలి అన్నట్టుగా చేస్తుంది. ఫైనల్ గా ఈ ఆదివారం దివ్య గేం ప్లాన్ తెలియడంతో పాటు భరణికి నాగార్జున ఇచ్చిన పుష్ తో ఆట మొత్తం మారే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
హౌస్ లోకి వచ్చినప్పుడు తన స్ట్రాంగ్ నెస్ చూపించి దివ్య మార్కులు కొట్టేసినా కూడా రాను రాను ఆమె ఆట గెలవడం కోసం కన్నా అవతల వారిని టార్గెట్ చేయడంతోనే సరిపోతుంది. ఇలానే కొనసాగితే మాత్రం ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కచ్చితంగా ఉందని చెప్పొచ్చు.