అందం విషయంలో ముద్దుగుమ్మ వాటికి దూరం..!

ఫిల్మ్ స్టార్స్ వెండి తెరపై అందంగా కనిపించడం అత్యంత అవసరం. అందుకోసం వారు చాలా కష్టపడుతూ ఉంటారు.;

Update: 2025-09-17 13:30 GMT

ఫిల్మ్ స్టార్స్ వెండి తెరపై అందంగా కనిపించడం అత్యంత అవసరం. అందుకోసం వారు చాలా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోలు తమ ఫిజిక్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, హీరోయిన్స్ తమ ఫిజిక్‌తో పాటు, తమ ఫేస్ గ్లో, బ్యూటీ పై శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. హీరోయిన్స్‌ అందంగా కనిపించినన్ని రోజులు వరుస ఆఫర్లు వస్తాయి, ఎప్పుడైతే వారిలో అందం తగ్గుతుందో అప్పటి నుంచి వారిని జనాలు పక్కన పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఆరు పదుల వయసు వచ్చినా అందంగా కనిపించే విధంగా వివిధ రకాల సర్జరీలు, కాస్మోటిక్‌లు, ఇతర రకాల చికిత్సలు ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ వాటి అవసరం లేకుండానే అందంగా కనిపిస్తున్నారు. భవిష్యత్తులూనే వారు వాటిని వినియోగించం అంటున్నారు.

నటిగానే కాకుండా దర్శకురాలిగానూ సినిమాలు..

నటిగా 20 ఏళ్ల క్రితమే కెరీర్‌ను ఆరంభించిన సీనియర్‌ నటి దివ్య ఖోస్లా. ఈమె నటిగానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కే విధంగా దర్శకత్వం చేసింది, నిర్మాతగా మారి ఎన్నో సినిమాలను అందించింది. అంతే కాకుండా తన అభిరుచికి తగ్గట్లుగా మ్యూజిక్ వీడియోలను సైతం అందించింది. హిందీ ప్రేక్షకులు రాబోయే పాతిక ఏళ్ల పాటు ఆమెను గుర్తుంచుకునే విధంగా సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చేసింది. అందుకే ఇప్పటికే దివ్య ఖోస్లా అంటే ప్రత్యేకమైన అభిమానంను ప్రేక్షకులు చూపిస్తూ ఉంటారు. 43 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా చాలా అందంగా కనిపించే దివ్య ఖోస్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఇండస్ట్రీలో అందం కోసం కొందరు ప్రాకులాడుతున్న తీరుపై సున్నితంగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అందం కోసం అవన్నీ అక్కర్లేదన్న దివ్య ఖోస్లా

చాలా మంది ఇండస్ట్రీలో అందం కోసం రకరకాల మాధ్యమాలను వినియోగిస్తూ ఉంటారు. ఏవి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వృధ్యాప్యంలోకి అడుగు పెట్టాల్సిందే అని దివ్య ఖోస్లా అన్నారు. కైలీ జెన్నర్‌ను చూసిన వారు ఎంతో మంది ఉంటారు. ఆమె చాలా చిన్న వయసు అయినా కూడా వయసుకు మించి చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించడం మనం చూశాం. ఇప్పుడు మనం ఎంతగా అందంగా కనిపించాలని భావించినా సమయం వచ్చినప్పుడు వృధ్యాప్యంలోకి వెళ్లాల్సిందే. ఆ విషయాన్ని గుర్తించకుండా తాము ఎప్పుడూ వయసు తగ్గి కనిపిస్తాం, ఎప్పుడూ పాతికేళ్ల వయసులోనే ఉంటాం అంటే ఎలా ఉంటుంది అంటూ ఆమె ప్రశ్నించింది. చిన్నప్పటి నుంచి తాను కనీసం బ్లీచ్‌ ను కూడా వినియోగించింది లేదు. తన తల్లి అన్నింటికి వ్యతిరేకంగా ఉండేదని దివ్య అన్నారు.

సోషల్‌ మీడియా ఫోటోలకు అవి అక్కర్లేదు

సోషల్‌ మీడియాలో నా ఫోటోలను షేర్ చేసే సమయంలో నా టీంలోని కొందరు ఫోటోలను ఎడిట్‌ చేయాలి అంటూ ఉంటారు. ఫేస్ పై ఉన్న చిన్న చిన్న మచ్చలను తొలగించడంతో పాటు, డ్రస్‌ ను సరి చేయడం, ఇతర విషయాల గురించి నాకు సూచనలు చేస్తూ ఉంటారు. ఏఐ ని ఉపయోగించి ఫోటోలను మరింత అందంగా చేయాలని వారు చెప్పినప్పుడు వద్దు అనే నా నుంచి సమాధానం వస్తుంది. నేను ఎలా ఉన్నానో అలాగే ప్రేక్షకుల ముందు ఉంచండి అంటాను. ఎక్కడ ఫోటోలు దిగినా, ఎలాంటి చోట ఫోటోలు దిగినా కూడా నన్ను నన్నుగానే చూపించాలి అని అందరికి చెబుతూ ఉంటాను. ఏఐ ని ఉపయోగించి లేదంటే మరేదైనా బ్యూటీ మాధ్యమం ను ఉపయోగించి నన్ను నేను అందంగా మల్చుకోవడం అసలు ఇష్టం లేదని చాలా మంది హీరోయిన్స్‌కి విభిన్నంగా దివ్య ఖోస్లా ఆలోచించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News