ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన దివి.. ఆ లుక్ రావాలంటే ఈ కష్టం తప్పనిసరి!

ట్రైనర్ సమక్షంలో తలకిందులుగా.. చేతులను ఫ్లోర్ పై పెట్టి.. కాళ్లను నిలువుగా పైకెత్తి నిటారుగా వ్యతిరేక దిశలో నిల్చొని తన వర్కౌట్స్ ను ప్రారంభించింది.;

Update: 2025-12-12 15:46 GMT

సాధారణంగా సినీ సెలబ్రెటీలు అంటే తమ అందాన్ని కాపాడుకోవడం కోసం చాలా కష్టపడుతుంటారు. సీరియల్ యాక్టర్స్ నుంచి హీరోయిన్స్ వరకు అందరూ కూడా తమ బాడీని పర్ఫెక్ట్ గా.. ఫిట్ గా మెయింటైన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అందుకోసం పలు రకాల డైట్స్ పాటించడం తోపాటు జిమ్ లో వర్కౌట్స్ వంటివి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా జిమ్లో సాహసాలు చేస్తూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్న వారిలో.. నటిగా సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటి సంపాదించుకున్న దివి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో పాటు ఫిట్నెస్ కి సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దివి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సినిమాలలో , వెబ్ సిరీస్లలో హీరోయిన్గా కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విషయంలోకి వెళ్తే.. ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇకపోతే గ్లామర్ గా ఉండడానికే కాదు శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి తాను ఏం చేస్తుంది అనే విషయాన్ని తెలియజేసింది.

ట్రైనర్ సమక్షంలో తలకిందులుగా.. చేతులను ఫ్లోర్ పై పెట్టి.. కాళ్లను నిలువుగా పైకెత్తి నిటారుగా వ్యతిరేక దిశలో నిల్చొని తన వర్కౌట్స్ ను ప్రారంభించింది. ముఖ్యంగా ఇది చూడడానికి , వర్ణించడానికి సులభంగా ఉన్నా.. చేయడం ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇలాంటి వర్కౌట్స్ చేయడం వల్ల శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడమే కాకుండా కండరాలు బలంగా మారుతాయి. ఇక తన ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు మైంటైన్ చేయడానికి ఇలాంటి కష్టమైన వర్కౌట్స్ చేస్తూ ఉంటానని చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే వర్కౌట్ విషయంలోనే కాదు తీసుకునే ఆహారం విషయంలో కూడా తాను ఎలాంటి నియమాలు పాటిస్తాను అనే విషయాన్ని కూడా గతంలో చెప్పుకొచ్చింది.

ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో దివి మాట్లాడుతూ.. "నేను నా ఆరోగ్యానికి, స్కిన్ హెల్తీగా ఉండేందుకు కాకరకాయ జ్యూస్, గ్రీన్ టీ, వెజిటేబుల్ జ్యూస్ వంటివి తాగుతాను. జుట్టు కోసం మందారం పువ్వు ఆకులు, ఆనియన్ జ్యూస్ పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, ఇలా నేను కొన్నేళ్లపాటు చేస్తూనే ఉన్నాను. అందుకే నేను ఇలా కనిపిస్తున్నాయని తెలిపింది. భోజనం కూడా మాక్సిమం తింటాను. అలా తిన్న తర్వాత కొద్దిసేపటికి వాటిని ఎక్సర్సైజ్ చేసి కరిగిస్తాను. రోజు వర్కౌట్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తానంటూ " తెలిపింది దివి.

Tags:    

Similar News