భారీ ధరకు అద్దెకు ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ దిశా పటానీ ప్రోఫెషనల్ కెరీర్ లోనే కాదు. స్మార్ట్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతోనూ వార్తల్లో నిలుస్తోంది.
బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ దిశా పటానీ ప్రోఫెషనల్ కెరీర్ లోనే కాదు. స్మార్ట్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులతోనూ వార్తల్లో నిలుస్తోంది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన ఖర్ వెస్ట్ లో ఆమెకు ఒక విలాసవంతమైన లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. తాజాగా ఈ నివాసాన్ని భారీ మొత్తానికి అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల రియల్ ఎస్టేట్ లావాదేవీలను చూసే వర్గాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అద్దె ఒప్పందం ద్వారా దిశా పటానీ భారీ ఆదాయాన్ని ఆర్జించబోతున్నారు.
రాబోయే రెండేళ్ల కాల పరిమితికి గానూ ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ ద్వారా అమ్మడికి దాదాపు 71 లక్షల వరకు అద్దె రూపంలో అందనుందిట. ముంబై లాంటి అంతర్జాతీయ మెట్రో నగరాల్లో సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే ప్రైమ్ లొకేషన్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఈ భారీ డీల్ మరోసారి నిరూపిస్తోంది.
ముంబైలోని ఖర్ వెస్ట్ ప్రాంతం బాలీవుడ్ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఇక్కడి లగ్జరీ అపార్ట్‌మెంట్లు అత్యాధునిక వసతులు, అద్భుతమైన సిటీ వ్యూస్ .. కచ్చితమైన వ్యక్తిగత భద్రతతో కూడి ఉంటాయి. దిశా పటానీకి చెందిన ఈ ఫ్లాట్ కూడా ఎంతో విలాసవంతంగా ఆధునిక ఇంటీరియర్‌తో డిజైన్ చేయబడిందని సమాచారం.
ఇలాంటి లగ్జరీ ప్రాపర్టీలను కేవలం సొంత అవసరాలకే కాకుండా వాటి ద్వారా స్థిరమైన ఉప-ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగించడం సెలబ్రిటీలలో ట్రెండ్‌గా మారింది. ప్రస్తుత కాలంలో సినిమా తారలు వచ్చే పారితోషికాలపైనే ఆధారపడకుండా తమ సంపాదనను విభిన్న రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. అందులో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత సురక్షితమైన .. లాభదాయకమైన మార్గంగా నిలుస్తోంది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ముంబైలో కమర్షియల్ .. రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసి వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా భారీగా సంపాదిస్తున్నారు.
తాజాగా దిశా పటానీ కూడా అదే స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బాటలో పయనిస్తున్నారు. వృత్తిపరమైన విషయానికి వస్తే దిశా పటానీ బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ ..పాన్-ఇండియా ప్రాజెక్టులలోనూ నటిస్తూ సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన నటి, గ్లామరస్ పాత్రలతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు బిజీ షూటింగ్ షెడ్యూల్స్.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను హ్యాండిల్ చేస్తూనే మరోవైపు ఆర్థికంగా పటిష్టం చేసుకునేందుకు ఇలాంటి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం విశేషం.
ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు - అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో దిశా పటానీ చేసిన తాజా డీల్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. లగ్జరీ ప్రాపర్టీలపై పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లభిస్తుందని ఈ తరహా ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. సినిమా రంగంలో కెరీర్ గ్రాఫ్ ఎలా ఉన్నా? స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఇలాంటి వనరులను ముందే సృష్టించుకోవడంలో నేటితరం సెలబ్రిటీలు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.