మారుతి కొత్త క‌థ కోసం మ‌రో ఏడాదా?

అయితే 'ది రాజాసాబ్' చిత్రం తర్వాత మారుతి తీసుకున్న సుదీర్ఘ విరామం ఫిలింనగర్ సర్కి ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-07-08 02:37 GMT

టాలీవుడ్‌లో దర్శకుడు మారుతి అంటే? తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ అందించే క్రియేటర్ అనే ముద్ర బలంగా ఉంది. అయితే `ది రాజాసాబ్` చిత్రం తర్వాత మారుతి తీసుకున్న సుదీర్ఘ విరామం ఫిలింనగర్ సర్కి ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మీడియాకు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటూ పూర్తిగా తన వ్యక్తిగత స్పేస్‌లోకి వెళ్లిపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఈ నిశబ్దం కేవలం విరామం మాత్రమే కాదు. తన కెరీర్ గ్రాఫ్‌ను తిరిగి మలచుకోవడానికి చేస్తున్న మౌన కసరత్తు అని అర్థమవుతోంది.

సాధారణంగా మారుతి శైలి వేరు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కథను సిద్ధం చేసుకునే వేగం ఆయన సొంతం. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఏడాది గ్యాప్ తీసుకోవడం వెనుక గత చిత్రాల లోటుపాట్లను సరిదిద్దుకోవాలనే పట్టుదల కనిపిస్తోంది. కథా చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటం వెనుక ఉద్దేశ్యం ఒక్కటే ప్రేక్షకుల నాడికి తగ్గట్టుగా మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్ దాటి కొత్త అనుభూతిని అందించాలన్నదే. మారుతి పాత ఫార్ములాలకు స్వస్తి పలికి కొత్త జానర్ వైపు అడుగులు వేస్తున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నారు. కామెడీ మాత్రమే కాకుండా ఎమో షనల్‌గా కనెక్ట్ అయ్యే కథలకు పట్టం కడుతున్నారు. ఈ మార్పును గుర్తించిన మారుతి తదుపరి స్క్రిప్టును సిద్ధం చేయడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కామెడీని ప్రధాన అస్త్రంగా వాడుకుంటూనే కథలో లోతును పెంచడం ఎలా? అనే విషయంపై తీవ్రమైన మేధోమథనం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మారుతి ఏ విషయాన్ని కూడా అత్యవసరంగా బయటకు రానివ్వడం లేదని తెలుస్తోంది.

ఇక టెక్నికల్ - ప్రొడక్షన్ పరంగా కూడా మారుతి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్నిసార్లు వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే ఒత్తిడిలో సాంకేతిక విలువలను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ప్రీ-ప్రొడక్షన్ పనులకే అత్యధిక సమయం కేటాయిస్తున్నారు. నిర్మాతలు కూడా మారుతికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా క్వాలిటీ విషయంలో ఎంత ఖర్చయినా? వెనుకాడొద్దని సూచించినట్లు టాక్.

కాస్టింగ్ విషయంలో కూడా మారుతి ప్లాన్ డిఫరెంట్‌గా ఉందిట‌. సాధారణంగా స్టార్ హీరోలతో చేసినప్పుడు ఉండే పరిమితులు కథా పరంగా వచ్చే ఒత్తిళ్లను అధిగమిస్తూ ఈసారి స్క్రిప్టుకు సరైన పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారుట‌. ఒక స్టార్ నటుడిని ఎలా సరికొత్తగా ఆవిష్కరించాలనే దానిపై మారుతి కసరత్తు చేస్తున్నారుట‌. కమర్షియల్ లెక్కలకే ప్రాధాన్యత ఇవ్వకుండా మేకింగ్ స్టైల్ ఎలా ఉండాలో? కూడా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వినికిడి.

మొత్తంగా మారుతి నిశ్శబ్దం వెనుక భారీ ప్రణాళికే ఉంది. వేగంగా సినిమాలు చేయడం కంటే వచ్చిన అవకాశాన్ని క్వాలిటీ ప్రొడక్ట్‌గా మలచాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ఏడాదిలో మారుతి నుంచి రాబోయే ప్రకటన మారుతి పాత ఇమేజ్‌ను చెరిపేసి కొత్త దర్శకుడిగా మారుతిని పరిచయం చేసేలా ఉంటుందని అభిమానులు ఆశీస్తున్నారు.

Tags:    

Similar News