నాకు వేరేది చేతకాదు-దిల్ రాజు

తనకు సినిమా తప్ప ఇంకేదీ చేతకాదని.. చచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తానని రాజు ఈ ఈవెంట్లో స్పష్టం చేశాడు.

Update: 2024-05-23 15:12 GMT

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుది ఎంతో స్ఫూర్తిదాయక ప్రస్థానం. చిన్న స్థాయి డిస్ట్రిబ్యూటర్‌గా మొదలుపెట్టి.. టాలీవుడ్‌ను శాశించే స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. ఇండస్ట్రీలో ఎంతోమంది దిగ్గజ నిర్మాతలు ప్రొడక్షన్ ఆపేసి సైడ్ అయిపోతే.. రాజు మాత్రం రెండు దశాబ్దాలకు పైగా విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు. సినిమాల పట్ల ఆయన ప్యాషన్ ఏంటన్నది మాటల్లో, చేతల్లో ఎన్నోసార్లు చూశాం. నిజానికి తాను గనుక రియల్ ఎస్టేట్ వైపు వెళ్లి ఉంటే వందలు, వేల కోట్లు సంపాదించేవాడినని.. కానీ సినిమాల పట్ల ఉన్న ఇష్టమే తనను ఇందులో కొనసాగేలా చేస్తోందని ఇంతకముందే చెప్పారు రాజు. తాజాగా తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం 'లవ్ మి' ప్రి రిలీజ్ ఈవెంట్లో సినిమా పట్ల తన ఇష్టాన్ని మరోసారి చాటుకున్నాడు రాజు.

తనకు సినిమా తప్ప ఇంకేదీ చేతకాదని.. చచ్చే వరకు సినిమాలు మాత్రమే చేస్తానని రాజు ఈ ఈవెంట్లో స్పష్టం చేశాడు. ''నాకొక బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి.. దీన్ని ఉపయోగించుకుని వేరే వ్యాపారాల్లోకి వెళ్లమని చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ ఎవ్వరు ఏ సలహా ఇచ్చినా.. సినిమాకు సంబంధించి ఏదైనా ఉంటే చెప్పండి అనే అడుగుతా. నేను సినిమాల వరకు ఏం చేయడానికైనా రెడీ. 20 ఏళ్లకు పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇంకో పదేళ్లు, పదిహేనేళ్లు, 20 ఏళ్లు అయినా సినిమాలు తీస్తూనే ఉంటా. చచ్చే వరకు సినిమాలే చేస్తా. ఇంకోటి చేయను. నాకు సినిమా తప్ప ఇంకేదీ తెలియదు. సినిమా అంటే నాకంత ఇష్టం'' అంటూ దిల్ రాజు ఎమోషనల్‌గా మాట్లాడాడు. రాజు సోదరుడు శిరీష్ తనయుడైన ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ‘లవ్ మి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News