• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ టైమ్ లో డబ్బులు టైట్...

ఆ టైమ్ లో డబ్బులు టైట్ ఉంటే ఆయన ఇచ్చారు: విజయ్ దేవరకొండ

| ఇక సినిమాలోని పాటలు టీజర్ అలాగే ట్రైలర్ కూడా మరింత హైప్ క్రియేట్ చేశాయి.

By - Tupaki Desk
Update: 2024-04-01 10:50 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో చేసిన మొదటి చిత్రం ఫ్యామిలీ స్టార్ ఈనెల 5వ తేదీన గ్రాండ్ గా విడుదలకు కాబోతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం లాంటి సినిమా తర్వాత విజయ్ పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై ముందుగానే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ఇక సినిమాలోని పాటలు టీజర్ అలాగే ట్రైలర్ కూడా మరింత హైప్ క్రియేట్ చేశాయి. మొత్తానికే సినిమా ప్రమోషన్స్ తో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ lo మేకర్స్ సినిమాలోని అనేక రకాల విషయాలను తెలియజేశారు. అలాగే విజయ్ దేవరకొండ తన పర్సనల్ లైఫ్ లోని మరికొన్ని విషయాలను కూడా తెలియజేశాడు.

తన ఆర్థిక పరిస్థితుల గురించి కూడా చెప్పాడు. ఒకానొక టైం లో హీరోగా చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కావు అని ఆ టైంలో వేరొకరిని అడగాల్సి వచ్చింది అని వివరణ ఇచ్చాడు. ముఖ్యంగా కోవిడ్ టైమ్ లో నాకు డబ్బులు టైట్ ఉంటే అప్పుడే దిల్ రాజు గారు బ్యాక్ టు బ్యాక్ కథలు పంపిస్తున్నారు. అయితే ఆ టైంలో స్క్రిప్టులు కాదు ముందు కొన్ని డబ్బులు ఉంటే ఇవ్వండి అని చాలా టైట్ గా ఉంది అని నేనే స్వయంగా అడిగాను.

అలా అడగ్గానే దిల్ రాజు గారు వెంటనే కొన్ని డబ్బులు ఇచ్చారు అని విజయ్ దేవరకొండ తెలియజేశాడు. సాధారణంగా దిల్ రాజు అయితే ముందుగానే ఏ హీరోకి కూడా అడ్వాన్స్ ఇవ్వడు. స్క్రిప్ట్ ఓకే అయితేనే హీరో కైనా దర్శకుడు కైనా అడ్వాన్స్ ఇస్తాడు. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక విజయ్ దేవరకొండ అలా అడగగానే దిల్ రాజు ఇచ్చేశారట.

విజయ్ చెప్పిన ఆ విషయాన్ని దిల్ రాజు అంగీకరిస్తూ ఆ టైంలో విజయ్ అడగగానే ఇచ్చేసాను అని అందులో పెద్దగా ఆలోచించలేదని అన్నాడు. ఇక ఇలాంటి మంచి హీరోతో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.. మంచి బాండింగ్ తో సినిమా కొనసాగింది అని అన్నారు. అలాగే విజయ్ తో మరో రెండు సినిమాలు చేయడానికి కూడా అగ్రిమెంట్ చేసుకున్నట్లు దిల్ రాజు వివరణ ఇచ్చాడు.

Tags:    
  • Familystar 
  • Vijaydevarakonda 
  • Mrunalthakur 
  • Money 
  • Dilraju 
  • Parusaram 
  • Tollywood 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS