చివరికి గాయకుడు కం నటుడికి ఈ దుస్థితి
`సర్ధార్జీ 3`లో పాకిస్తానీ నటి హనియా అమీర్‌కి అవకాశం కల్పించిన దిల్జీత్ దోసాంజ్ భారతదేశంలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.;
'సర్ధార్జీ 3'లో పాకిస్తానీ నటి హనియా అమీర్‌కి అవకాశం కల్పించిన దిల్జీత్ దోసాంజ్ భారతదేశంలో తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అతడు తన సినిమా సర్దార్జీ 3ని ఇండియాలో రిలీజ్ చేయలేకపోయాడు. అతడిపై పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఫిర్యాదు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతడు సన్నీడియోలో బార్డర్ 2 నుంచి తప్పుకున్నాడు! అంటూ ప్రచారం సాగుతోంది.
అయితే ఈ పుకార్లను దిల్జీతో కొట్టి పారేసాడు. తాజా వీడియోలో దోసాంజ్ ఒక బ్యాచ్ తో ఆర్మీ చిహ్నం ఉన్న సూట్ ధరించి వానిటీ వ్యాన్ నుండి దిగుతున్నాడు. కెమెరాలు పూర్తి స్థాయి నృత్య సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే, అతడు సెట్‌లోకి వెళ్తాడు, టైటిల్ ట్రాక్ `సందేసే ఆతే హై` నేపథ్యంలో ప్లే అవుతోంది. ఈ క్లిప్ `బోర్డర్ 2` అనే టైటిల్‌తో ముగుస్తుంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహన్ శెట్టిలతో పాటు దిల్జిత్ ఇందులో కీలక పాత్రలో నటించాడు.
మొత్తానికి దిల్జీత్ తనను ప్రతిష్ఠాత్మక చిత్రం బార్డర్ 2 నుంచి తొలగించలేదని నిరూపించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అతడు షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పహల్గామ్ లో ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్టిస్టుల కష్టాలు మొదలయ్యాయి. వారికి భారతీయ సినీపరిశ్రమల్లో అవకాశాలు లేవు. అయితే పాకిస్తానీ నటికి అవకాశం కల్పించిన దిల్జీత్ ను సినిమా నుంచి తొలగించాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) బోర్డర్ 2 నిర్మాతలకు అధికారికంగా పిటిషన్ వేసింది. దిల్జీత్ ని బహిష్కరణకు గురైన నటుడు అంటూ ఈ లేఖలో పేర్కొనడమే గాక అతడికి సహకరించవద్దని కోరారు. అయితే దీనికి సంఘం ఒప్పుకోలేదు. అప్పటికే చిత్రీకరణ పూర్తయిన సినిమా నుంచి ఆర్టిస్టును అర్థాంతరంగా తొలగించడం కుదరదని స్పందించింది. దిల్జిత్ క దాదాపు తొమ్మిది నెలల క్రితం టీమ్ లో చేరాడని ధృవీకరించారు.