ఈ సారి బంతి దిలీప్ కోర్టులో?
నటి మంజువారియర్ ను దిలీప్ కుమార్ 1998లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత మాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్లాడు.;
మలయాళ నటుడు దిలీప్ కుమార్ లైంగిక ఆరోపణల కేసు నుంచి నిర్దోషిగా తేలిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ విచారణ అనంతరం దిలీప్ కుమార్ పై కొన్ని గంటల క్రితమే కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. అడిషనల్ స్పెషల్ సెషన్స్ కోర్ట్ దిలీప్‌పై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేసింది. దీంతో దిలీప్ కుమార్ తనపై కుట్ర పన్నిన వారందరిపై ఎటాకింగ్ కి రెడీ అవుతున్నాడు. కేసులో ఇరికించిన వారందరిపై చట్ట పరమైన చర్యలు తీసుకుం టానని ప్రకటించాడు.
ఓ ఉద్యోగుల బృందం తనను ఈ కేసులో ఇరికించిందని, విచారణ మొదలైన మొదటి నాలుగు నెలల్లో బాధితురాలు తన పేరును చెప్పలేదని దిలీప్ అన్నారు. ఈ కుట్రలో పాలు పంచుకున్న మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖలతో పాటు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పైనా దిలీప్ ఫిర్యాదు దాఖలు చేయాలని భావిస్తు న్నారు . కోర్టు తీర్పు కాపీని సమీక్షించిన అనంతరం వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని దిలీప్ తెలిపాడు. ఈ కేసులో సిట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించిందని దిలీప్ అరోపించారు.
అలాగే తన అరెస్ట్ సమయంలో మాజీ భార్య మంజు వారియర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేసు కున్నారు. నటి మంజువారియర్ ను దిలీప్ కుమార్ 1998లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత మాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్లాడు. అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు. ధాంపత్య జీవితంతో సాపీగా సాగిపోతుంది. అదే సమయంలో అతడి జీవితంలోకి కావ్యా మాధవన్ ప్రవేశించింది. ఇద్దరు కలిసి నటించిన చిత్రాలకు మాలీవుడ్ ఆడియన్స్ నీరాజనం పట్టారు. దీంతో చిత్ర పరిశ్రమలో ఆ జోడీ ఆసక్తికరంగా మారింది.
ఆ పరిచయం స్నేహం, ప్రేమగానూ మారిందనే వార్తలొచ్చాయి. మంజు వారియర్‌కు మోసం చేస్తున్నారనే కారణంతో దిలీప్, కావ్యలను లైంగిక దాడికి గురైన నటి హెచ్చరించిందనే ఆరోపణులున్నాయి. ఈనేపథ్యంలో దిలీప్ ఆ నటిపై ద్వేషం పెంచుకున్నట్లు అప్పటి మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే సమయంలో దిలీప్-మంజు వారియర్ మధ్య విబేధాలు తలెత్తి 2015లో విడాకులతో వేరయ్యారు. అటుపై కావ్యా మాధవన్ ను దిలీప్ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ నటిపై లైంగిక దాడి చేయించింది దిలీప్ అనే అరోపణలతో అరెస్ట్ అయ్యాడు.