మార్నింగ్ షో బాగుంటేనే ఈవెనింగ్.. ప్రొడ్యూసర్ కు బిగ్ ఛాలెంజ్ ఇదే: దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు తమ్ముడు మూవీతో థియేటర్స్ లో సందడి చేయనున్నారు.;
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు తమ్ముడు మూవీతో థియేటర్స్ లో సందడి చేయనున్నారు. యంగ్ హీరో నితిన్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. కాంతార ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సీనియర్ నటి లయ.. తమ్ముడు సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర వంటి పలువురు నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. అక్కా- తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందిన మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించగా, జూలై 4వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్నారు.
రీసెంట్ గా సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్నారు. అదే సమయంలో జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. నిర్మాత దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ్ముడు టైటిల్ తో పాటు ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"తమ్ముడు మూవీ కథ చెప్పినప్పుడే బ్రదర్, సిస్టర్ మధ్య ఉండే డిఫరెంట్ స్టోరీగా అనిపించింది. మా బ్యానర్ పై అన్నీ జోనర్స్ లో సినిమాలు చేశారు. అమ్మ- నాన్న, వదిన- మరిది, అన్న- తమ్ముడు సినిమాలు చేశాం. సినిమాలో నితిన్ రోల్ చుట్టూ ఐదుగురు మహిళల పవర్ ఉంటుంది. వాళ్లతో మంచి బాండేజ్ ఉంటుంది. అవన్నీ కీలక పాత్రలు" అని చెప్పారు.
అందుకే బ్రదర్, సిస్టర్ స్టోరీ కాబట్టి.. తమ్ముడు అని టైటిల్ ను పెట్టినట్టు దిల్ రాజు తెలిపారు. సినిమా నుంచి అదిరిపోయే అమ్మవారి సాంగ్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏ సినిమా అయినా శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక.. మార్నింగ్ షో బాగుంటేనే.. సినిమా బాగుందంటేనే ఈవెనింగ్ షోలు అందుకుంటున్నాయని దిల్ రాజు చెప్పారు.
మార్నింగ్ షో బాగుంటేనే ఈవెనింగ్ షోలకు ఆడియన్స్ వస్తారని, ప్రజలు అలా ఫిక్స్ అయ్యారని తెలిపారు. ఎందుకు రా బాబు.. సినిమా బాగుంటే వెళ్దామనుకుంటున్నారని అన్నారు. ప్రొడ్యూసర్ కు ఇది బిగ్ ఛాలెంజ్ అని చెప్పారు. ఒకప్పుడు అలానే జరిగేదని, ఇప్పుడు అదే జరుగుతుందని తెలిపారు. ఫస్ట్ షో పడ్డాకే రెవెన్యూ డిసైడ్ అవుతుందని పేర్కొన్నారు.