ఆయన కాకుంటే సంక్రాంతికి వచ్చేది ఇంకెవరూ...?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్‌ అనగానే చాలా మంది బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పేరును ప్రస్థావించారు.;

Update: 2025-10-15 06:42 GMT

2025 సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో దిల్‌ రాజు ఉన్నాడు. ఇప్పటికే ఆ విషయాన్ని దిల్‌ రాజు ఆఫ్‌ ది రికార్డ్‌ క్లారిటీ ఇచ్చాడు. అయితే హిందీలో వెంకటేష్‌ పోషించిన పాత్రను ఎవరు పోషిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరో వెంకటేష్ పాత్ర అత్యంత కీలకం అయితే, ఆ స్థాయిలో భాగ్యం పాత్ర అందరినీ మెప్పించింది. ఐశ్వర్య రాజేష్‌ ఆ పాత్రలో చక్కగా నటించి మెప్పించింది. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఆ స్థాయిలో ఆదరణ లభించింది. ఇక పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో మీనాక్షి చౌదరి నటించి మెప్పించింది. బుల్లి రాజు పాత్రలో నటించిన రేవంత్ సైతం ఆకట్టుకున్నాడు. ఈ నాలుగు పాత్రల వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఆ పాత్రలకు తగ్గట్లుగా హిందీలో నటీ నటులు కావాల్సిన అవసరం ఉంది.

వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్‌ అనగానే చాలా మంది బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పేరును ప్రస్థావించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు బాగా సెట్‌ అవుతాయని అంతా అనుకున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమాలను కేవలం అక్షయ్‌ కుమార్‌ చేస్తేనే చూస్తారు అంటూ చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దిల్‌ రాజు ఇటీవలే అక్షయ్‌ కుమార్‌కి అడ్వాన్స్ ఇచ్చాడని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్‌ ను ఆయన హీరోగా వచ్చే ఏడాదిలో మొదలు పెట్టి, 2026 చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేశాడంటూ తెలుగు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీమేక్‌ లో అక్షయ్‌ కుమార్‌ అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అంటూ తేల్చారు. ఆ విషయంలో ఒక్క శాతం కూడా నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

అక్షయ్‌ కుమార్‌ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం కేవలం పుకార్లే

ప్రస్తుతానికి అక్షయ్‌ కుమార్‌ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. కనుక అప్పటి వరకు ఆయన నుంచి కొత్త సినిమాలు ఉండక పోవచ్చు. ఆయన ఒకవేళ కొత్త సినిమాలకు కమిట్‌ అయినా కూడా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఆ సినిమాను చేయాల్సి ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాంకు సీక్వెల్‌గా సంక్రాంతికి మళ్లీ వస్తున్నాంను దిల్‌ రాజు నిర్మించబోతున్నాడు. సీక్వెల్‌ ప్రారంభంకు ముందే ఈ రీమేక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. అందుకే అక్షయ్‌ కుమార్‌ కాకుండా మరో హీరోతో రీమేక్‌ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అక్షయ్‌ కుమార్‌ కాకుండా ఇలాంటి పాత్రలకు ఎవరు అయితే బాగుంటుందా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే దర్శకుడి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దిల్‌ రాజు నిర్మాణంలో హిందీ సంక్రాంతికి వస్తున్నాం

బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, దిల్‌ రాజు ఈ రీమేక్‌ను అనీస్‌ బాజ్మీ దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే అనీస్‌ బాజ్మీ హిందీ రీమేక్ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడట. స్క్రిప్ట్‌లో హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారట. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత ఒకరు ఇద్దరు హీరోల వద్దకు వెళ్లి సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి హీరో విషయంలో తుది నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్‌ ప్రారంభించాలి కనుక అప్పుడే నటీనటుల ఎంపిక చేయాలని దిల్‌ రాజు అండ్‌ టీం భావిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌తోనే సినిమాను కాస్త ఆలస్యం అయినా రీమేక్ చేయాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ దిల్‌ రాజు మాత్రం అప్పటి వరకు వెయిట్‌ చేసే పరిస్థితి కనిపించడం లేదు అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిందీలో అక్షయ్‌ కుమార్‌ కాకుంటే మరెవ్వరు చేస్తారు అనేది చూడాలి.

Tags:    

Similar News