దిల్ రాజు బాలీవుడ్ మూవీ.. కొత్త అప్డేట్ ఏంటంటే?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి దిల్ రాజు ఓ మూవీ చేయనున్నారని సమాచారం.;
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరన్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అటు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూనే.. వివిధి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రీసెంట్ గా యంగ్ క్యాస్టింగ్ ను ఎంకరేజ్ చేసేందుకు దిల్ రాజు డ్రీమ్స్ కూడా స్టార్ట్ చేశారు.
అయితే ఈ ఏడాది రెండు సినిమాలు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దిల్ రాజు. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు వరుస చిత్రాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. తనదైన ప్లాన్ తో సందడి చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. వివిధ బడా సినిమాలను తెరకెక్కించనున్నారని సమాచారం.
త్వరలో టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు బడా హీరోలతో సినిమాలు నిర్మిస్తారని తెలుస్తుండగా.. బాలీవుడ్ లో కూడా రెండు మూవీలు రూపొందిస్తారని ఇటీవల టాక్ వచ్చింది. అయితే ఇప్పటికే దిల్ రాజు.. బీ టౌన్ లో హిట్, జెర్సీ వంటి సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు చిన్న విరామం తర్వాత భారీ బడ్జెట్ తో రెండు బడా సినిమాలు తీయనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి దిల్ రాజు ఓ మూవీ చేయనున్నారని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వంశీ పైడిపల్లి ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని వినికిడి.
ఇప్పటికే సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని సమాచారం. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన నటీనటుల డీటెయిల్స్ తో పాటు షూటింగ్ వివరాలను కూడా వెల్లడించబోతున్నారని టాక్. దిల్ రాజు- సల్మాన్- వంశీ కాంబినేషన్ లో క్లాస్ మాస్ యాక్షన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.
అయితే సినిమా కోసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటాలు తీసుకోబోతున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు కనీస రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని, ప్రాఫిట్స్ లో కాస్త పెద్ద షేర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అందుకు సల్మాన్ కూడా ఓకే చెప్పారని వినికిడి. మరి ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.