ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్.. దిల్ రాజు భుజం తట్టి మరీ!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-12 09:43 GMT
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్.. దిల్ రాజు భుజం తట్టి మరీ!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందిన ఆ సినిమా.. జులై 4న విడుదల కానుంది. ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

హీరోల మద్దతుతో పాటు రెమ్యునరేషన్, సహకారం గురించి దిల్ రాజు మాట్లాడారు. నిర్మాతకు బడ్జెట్ సమస్యలు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సహకరించాలని పరోక్షంగా కోరారు. ఇప్పుడు నితిన్.. గతంలో మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ లు తనను సపోర్ట్ చేశారని తెలిపారు. కరెక్ట్ గా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే హీరోలు సపోర్ట్ చేస్తారని దిల్ రాజు అన్నారు.

"తమ్ముడు ముూవీ ఒకానొక టైమ్ లో చాలా లేట్ అవుతూ వచ్చింది. 22 ఏళ్ల నాకు ఒక సర్ప్రైజ్ అది.. ఓ రోజు ఏంటి వేణు.. అలా సినిమా చేస్తూ వెళ్తున్నావ్? ప్రొడ్యూసర్ గా బడ్జెట్ వెనక్కి రావాలి కదా అని అన్నా. ఎలా మరి అని అడిగాను. ఇక డబ్బులు డ్రా చేయనని వేణు చెప్పాడు. సినిమా హిట్ అయ్యాక పిలిచి ఇవ్వండని చెప్పాడు" అని తెలిపారు.

"నితిన్ కు కూడా ఇటీవల ఆ విషయం చెప్పాను. అప్పుడు మీరు ఎంత పంపిస్తారో అంతే ఇవ్వండి.. నేను రెమ్యునరేషన్ కోసం ఆలోచించట్లే అని చెప్పాడు. దిల్ రాజు కు హీరో, డైరెక్టర్ సపోర్ట్ చేస్తున్నారంటే అంతా ఆలోచించండి. సక్సెస్ వస్తే రెమ్యునరేషన్లు అందరివీ పెరుగుతాయి. కానీ ఫ్లాప్ అయితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతారు" అని దిల్ రాజు చెప్పారు.

"నేను హీరోలందరితో పని చేశా. గుడ్ అండ్ బ్యాడ్.. అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోల్లో నా భుజం తట్టి చాలా మంది గో హెడ్ అన్నారు. బృందావనం సమయంలో ఎన్టీఆర్, మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైమ్ లో మహేష్ బాబు, వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు సహకరించారు" అని తెలిపారు.

"ప్రొడ్యూసర్ సినిమాలు తీయడమే కాదు.. ఎకనామిక్స్ కూడా హీరోలతో కూర్చుని రియాలిటీగా షేర్ చేసుకోవాలి. అప్పుడే వాళ్లు కూడా సహకరిస్తారు. కానీ ఇప్పుడు ఎవరికీ ఓపిక లేదు. వెంటనే ప్రాజెక్టులను నిర్మాతలు సెట్ చేసుకుంటున్నారు. లేట్ అయితే పోతుందని వెళ్తున్నారు" అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Tags:    

Similar News