దిల్ రాజు మీద ట్రోల్స్ మామూలుగా లేవుగా..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి పందిరి మూవీతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు.;

Update: 2025-05-27 08:29 GMT

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి పందిరి మూవీతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించి అలరించారు. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు.

రీసెంట్ గా కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు గాను దిల్‌ రాజు డ్రీమ్స్‌ పేరుతో కొత్త బ్యానర్‌ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తన బ్యానర్స్ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. అవన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఇప్పుడు దిల్ రాజుపై ఫుల్ గా మీమ్స్ కనిపిస్తున్నాయి. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

నిజానికి.. ట్రోలర్స్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరూ చెప్పలేం. ఇప్పుడు దిల్ రాజుపై పడ్డారు. అందుకు కారణం ఆయన కామెంట్సే. రీసెంట్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు.

ప్రభుత్వం నుంచి అన్ని విషయాల్లో మద్దతు లభిస్తున్నా.. ఇప్పటివరకు ముఖ్యమంత్రిని కలవకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరూ తన వద్దకు వ్యక్తిగతంగా రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సినీ ఇండస్ట్రీ అంతా ఆ నలుగురు చేతిలో ఉందని అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అందులో దిల్ రాజు పేరు కూడా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన నిన్న ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ నలుగురు అని అంటున్నారు.. అదేం లేదని చెప్పారు. ఆ సమయంలో తాను వేరే లెవెల్ కు వెళ్లిపోయానని, కింద లేనని అన్నారు. దిల్ రాజు డ్రీమ్స్ తో కొత్త వాళ్లతో పని చేస్తున్నానని.. ఇంటర్నేషనల్ కంపెనీతో టై అప్ అయ్యానని తెలిపారు.

అందుకు సంబంధించిన ఆయన ఇప్పుడే వెళ్లారని, తాను ఆ లెవెల్ లో ఆలోచిస్తున్నానని తెలిపారు. ఏఐ టెక్నాలజీని ఇండస్ట్రీకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇండియా లెవెల్ లో మూవీలు తీయడం లేదని, బాలీవుడ్ లో కూడా తీయలేదని గుర్తుచేస్తున్నారు.

అలాంటిది ఇప్పుడు ఇంటర్నేషనల్.. హాలీవుడ్ అంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయన లోకల్ కాదని.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దిల్ రాజుపై మీమ్స్, ట్రోల్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఆయన కామెంట్స్.. మంచి ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. మరి దిల్ రాజు రెస్పాండ్ అవుతారేమో చూడాలి.

Full View
Tags:    

Similar News