• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు హీరోల‌ను...

తెలుగు హీరోల‌ను విదేశీయులు ఆద‌రిస్తున్నారు: దిల్ రాజు

| బాలీవుడ్ తార‌లు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు. అభిమానులు ఎన్టీఆర్‌పై విపరీతమైన ప్రేమ ఆద‌ర‌ణ‌ను చూపిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-27 14:26 GMT

ఎన్టీఆర్ - కొరటాల శివల యాక్షన్ డ్రామా `దేవర` ఈ శుక్ర‌వారం థియేటర్లలో విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ డ్రామా ఘనమైన ఓపెనింగ్ ల‌ను సాధించింద‌ని ట్రేడ్ చెబుతోంది. ఇందులో బాలీవుడ్ తార‌లు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు. అభిమానులు ఎన్టీఆర్‌పై విపరీతమైన ప్రేమ ఆద‌ర‌ణ‌ను చూపిస్తున్నారు.

మొద‌టి రోజు అభిమానుల స్పంద‌న అమోఘం. తాజాగా స‌క్సెస్ మీట్ లో `దేవ‌ర` నైజాం పంపిణీదారుడు దిల్ రాజు మాట్లాడుతూ..``దేవ‌ర ఎన్టీఆర్ వ‌న్ మ్యాన్ షో. అత‌డి న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంది. దేశ విదేశాల్లో ఈ సినిమాకి గొప్ప ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో మ‌న హీరోల‌కు గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కుతోంది`` అని అన్నారు. కొర‌టాల మాట్లాడుతూ-``నా కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది అని అంతా మెచ్చుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచి వ‌రుస ఫోన్లు వ‌స్తూనే ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. మూడేళ్ల ప్ర‌యాణ‌మిది`` అని అన్నారు. మా త‌మ్ముడు, మా నాన్న ఎన్టీఆర్ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశాడ‌ని, ఇది వ‌న్ మ్యాన్ షో అని నిర్మాత‌ల్లో ఒక‌రైన క‌ళ్యాణ్ రామ్ ఆనందం వ్య‌క్తం చేసారు.

కొర‌టాల‌కు థాంక్స్:

తాజాగా స‌క్సెస్ నేప‌థ్యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియాలో కొర‌టాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ``నేను ఎదురుచూస్తున్న రోజు చివరకు వచ్చింది. మీ అపురూపమైన రియాక్షన్స్‌తో పొంగిపోయాను. కొరటాల శివ గారూ, ఇంత ఆకర్షణీయమైన డ్రామా భావోద్వేగ అనుభవంతో దేవరను ఊహించినందుకు ధన్యవాదాలు. నా సోదరుడు అనిరుధ్, మీ సంగీతం నేపథ్య సంగీతం దేవ‌ర‌ ప్రపంచానికి ప్రాణం పోసింది. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి, సుధాకర్ మిక్కిలినేని గారికి బలమైన స్థంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు`` అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఇతర సాంకేతిక నిపుణులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చివ‌రిగా తన అభిమానుల సెల‌బ్రేష‌న్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి వినోదాత్మ‌క చిత్రాల‌ను మ‌రిన్ని అందిస్తాన‌ని తార‌క్ ప్రామిస్ చేసాడు.

Tags:    
  • Koratalasiva 
  • NTR 
  • Devara 
  • Devarasuccessmeet 
  • Janhvikapoor 
  • Tollywood 
  • Devaramovie 
  • Saifalikhan 
  • Tarak 
  • Dilraju 
  • Kalyanram 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS