2026 లో రాజుగారు 2017ని చూపిస్తారా!

ఏడాది ఆరంభంలోనే దిల్ రాజు కి `గేమ్ ఛేంజ‌ర్` రూపంలో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసిన సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది.;

Update: 2025-12-03 02:30 GMT

ఏడాది ఆరంభంలోనే దిల్ రాజు కి `గేమ్ ఛేంజ‌ర్` రూపంలో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసిన సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో `సంక్రాంతికి వ‌స్తున్నాం` రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డ‌టంతో పెను విప‌త్తు నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌లిగారు. లేదంటే? రాజుగారి ప‌రిస్తితి ఎలా ఉండేదో ఊహ‌కి రానిదే. ఈ విష‌యాన్ని ఆయ‌న సోద‌రుడు ల‌క్ష్మ‌ణ్ స్వ‌యంగా ర‌వీల్ చేసాడు. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన `త‌మ్ముడు` కూడా డిజ‌స్ట‌ర్ అయింది. ఈ సినిమాతోనూ భారీ న‌ష్టాలే వ‌చ్చాయి.

గ‌త ఏడాది రిలీజ్ అయిన `ఫ్యామిలీ స్టార్` కూడా నిరాశ‌ప‌రిచిన చిత్ర‌మే. ఇంకా ముందుకెళ్తే గుణ‌శేఖ‌ర్ తో క‌లిసి చేసిన `శాకుంతలం` ఫెయిలైంది. రాజుగారు స్వ‌యానా నిర్మించిన `వారిసు` అలియాస్ `వారసుడు` కూడా ప్లాప్ అయింది. `బ‌లంగం` బాగానే ఆడినా ఆ ముందు చిత్రం `థాంక్యూ` కూడా ప్లాప్ అయింది. మొత్తంగా చూస్తే కొంత కాలంగా రాజుగారి స్పీడ్ త‌గ్గింద‌న్న‌ది వాస్త‌వం. ఒక హిట్ ఒక ప్లాప్ అన్న చందంగా ఎడెనిమిదేళ్ల కెరీర్ క‌నిపిస్తుంది. దీంతో రాజుగారు పున‌ర్వవైభం కోసం మాస్ట‌ర్ ప్లాన్ చేస్తున్నారు. మ‌ళ్లీ 2017 త‌రహాలో 2026 లో వ‌రుస హిట్ల‌తో మోతెక్కించాల‌ని ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారు.

2017లో రిలీజ్ అయిన `శ‌త‌మానం భ‌వతి`, `నేను లోక‌ల్`, `డీజే`, `ఫిదా`, `రాజా ది గ్రేట్,` `మిడిల్ క్లాస్ అబ్బాయ్` అన్ని భారీ విజ‌యాలు సాధించిన‌వే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అదే హిట్ లైన‌ప్ రాజుగారికి క‌నిపించ‌లేదు.ఈ నేప‌థ్యంలో 2026 లో హిట్ లైన‌ప్ ప్లానింగ్ లో ఉన్నారు. వేణుతో `ఎల్ల‌మ్మ` వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్కుతుంది. అలాగే `సంక్రాంతికి వ‌స్తున్నాం` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అక్ష‌య్ కుమార్ హీరో కాగా, అనీష్ బ‌జ్మీ ద‌ర్శ‌కుడు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌నాయ‌కుడిగా `రౌడీ జ‌నార్ద‌న్` తెర‌కెక్కుతోంది.

ఇవ‌న్నీ 2026 లో రిలీజ్ అయ్యే సినిమాలే. అన్నీ క్రేజీ కాంబినేష‌న్స్ కావ‌డంతో? వీటిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. వాటి స‌క్సెస్ పై రాజుగారు అంతే ధీమాగా ఉన్నారు. ఇంకా స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కూడా వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంది. రిలీజ్ అన్న‌ది అప్ప‌టి ప‌రిస్థితుల‌పై ఆధార‌ప‌డి ఉం టుంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా ఓ క‌మిట్ మెంట్ ఉంది. ఆ చిత్రాన్ని కూడా వ‌చ్చే ఏడాది పట్టాలెక్కించాన్న‌ది రాజుగారి ప్లాన్.

Tags:    

Similar News