ధూమ్4 బాధ్యతలు ఆ డైరెక్టర్‌కు?
ధూమ్4 సినిమా కోసం ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ ను ఎప్పుడో మెయిన్ లీడ్ గా ఫిక్స్ చేశారు. అయాన్ ముఖర్జీ మీదున్న నమ్మకంతో రణ్‌బీర్ కనీసం పూర్తిగా కథ కూడా వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.;
ధూమ్ ఫ్రాంచైజ్ సినిమాకు బాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ అభిమానులున్నారు. బైక్ ఛేజింగ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ఫ్రాంచైజ్ తోనే మొదలైంది. అసలు ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఇంకా చెప్పాలంటే ధూమ్ ఫ్రాంచైజ్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ధూమ్ మొదటి రెండు పార్టుల్లో హృతిక్ రోషన్, జాన్ అబ్రహం నటించారు.
ఆ రెండు పార్టులకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాన్ని చూసి ఆమిర్ ఖాన్ మూడో భాగంలో అడిగి మరీ నటించాడు. ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో అడిగి మరీ సినిమా చేశాడంటే ధూమ్ ఫ్రాంచైజ్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. 2013లో ధూమ్3 రిలీజైంది. అప్పట్నుంచి ధూమ్4 కు సంబంధించి ఎలాంటి వార్తలు రాలేదు. అయితే ఇప్పుడు ధూమ్4 సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో ప్రస్తుతం వార్2 సినిమా చేస్తున్న అయాన్ ముఖర్జీకి ఈ ధూమ్4 సినిమా బాధ్యతల్ని అప్పగించినట్టు బాలీవుడ్ వర్గాలంటున్నాయి. ముందు అనుకున్న ప్రకారమైతే వార్2 పూర్తవగానే అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర2 చేయాలి కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లో అంత బడ్జెట్ కేటాయించలేమని నిర్మాత కరణ్ జోహార్ చెప్పడంతో అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర2 బదులు యష్ రాజ్ ఫిల్మ్స్ లో ధూమ్4 చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ధూమ్4 సినిమా కోసం ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ ను ఎప్పుడో మెయిన్ లీడ్ గా ఫిక్స్ చేశారు. అయాన్ ముఖర్జీ మీదున్న నమ్మకంతో రణ్‌బీర్ కనీసం పూర్తిగా కథ కూడా వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యానిమల్ సినిమా తర్వాత రణ్‌బీర్ క్రేజ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అతను ధూమ్4 చేస్తే అనౌన్స్‌మెంట్ తోనే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. కానీ అంతకంటే ముందే అయాన్ ముఖర్జీ వార్2 సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. వార్2 టీజర్ లో హృతిక్, ఎన్టీఆర్ ను ప్రెజెంట్ చేసిన విధానంతో పాటూ కొన్ని లోపాలు అయాన్ పై క్రిటిసిజం ను తీసుకొచ్చాయి. కాబట్టి వాటన్నింటినీ పోగొట్టుకుని వార్2 తో అయాన్ ది బెస్ట్ అనిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.