ధనుష్‌కు పవన్ ఆ ఛాన్స్ ఇస్తాడా?
ఈ సందర్భంగా హీరో ధనుష్ చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.;
కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ధనుష్ హీరోగా నటించిన మూవీ 'కుబేర'. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున కోటీశ్వరుడిగా నటించిన ఈ సినిమా భారీ స్థాయిలో ఈ నెల 20న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా యాంకర్ సుమ టీమ్ మెంబర్స్‌తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో ధనుష్ చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అవకాశం వస్తే తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో డైరెక్టర్‌గా సినిమా చేయాలనుకుంటున్నానని ధనుష్ తన మనసులో మాట బయటపెట్టారు. అయితే ఇది ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. జనసేన పార్టీని స్థాపించి పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌లకు ఆయన వద్ద టైమ్ లేదు.
గతంలో అంగీకరించిన సినిమాలకే ఆయన టైమ్ కేటాయించలేకపోయారు. కొన్ని నెలలుగా పవన్ బిజీగా ఉన్న కారణంగా 'హరి హర వీరమల్లు', 'ఓజీ,' 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాల షూటింగ్‌లు నిరవధికంగా వాయిదాపడుతూ రావడం తెలిసిందే. ఇటీవలే కొంత సమయం కేటాయించిన పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు'ని పూర్తి చేశారు. ఇక సుజీత్ 'ఓటీ'ని కూడా పట్టాలెక్కించి తన పోర్షన్ కంప్లీట్ చేసి యూనిట్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' సెట్‌లోకి అడుగుపెట్టారు.
దీని షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది. పవన్ కోసం ఇన్నాళ్లు క్రిష్, సుజీత్, హరీష్ శంకర్ వేయిట్ చేశారు. ఇలా ఎదురు చూడలేక క్రిష్ మరో సినిమాకు వెళ్లిపోయాడు కూడా. వీళ్లతో పాటు గత కొంత కాలంగా పవన్ కోసం స్టైలిష్‌డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. పవన్‌తో సినిమా చేయాలంటే వీళ్లలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి ధనుష్‌కు ఆ పేషెన్సీ ఉందా?..ఉన్నా కానీ నటుడిగా బిజీగా ఉండే ధనుష్..నటనని పక్కన పెట్టి పవన్ కోసం నెలల తరబడి వేయిట్ చేయగలడా? అలా చేసినా ధనుష్‌కు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ఛాన్స్ ఇస్తాడా? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.