230 కోట్ల ఆస్తిపరుడైనా సాధారణ జీవితం!
కోలీవుడ్ అత్యంత ప్రతిభావంతులైన నటులలో ధనుష్ ఒకరు. నటుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, దర్శకుడిగా , నిర్మాతగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసారు.
కోలీవుడ్ అత్యంత ప్రతిభావంతులైన నటులలో ధనుష్ ఒకరు. నటుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, దర్శకుడిగా , నిర్మాతగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసారు. కెరీర్ ఆరంభం నుండి గ్లోబల్ స్టార్ స్థాయి వరకు ఆయన ఎదిగిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. అంతేనా 230 కోట్ల రూపాయల ఆస్తిపరుడు. విలాసవంతమైన జీవనశైలి తో పాటు అత్యంత సంపన్న నటులలో ఒకరిగానూ నిలుస్తున్నారు. ధనుష్ ఆస్తుల విషయానికి వస్తే ఆయనకు చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన పోయెస్ గార్డెన్‌లో 150 కోట్ల రూపాయల విలువైన బంగ్లా ప్రధానాకర్షణగా నిలుస్తుంది.
అత్యంత భద్రత .. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ భవనం నగరంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటి. అంతే కాదు అళ్వార్‌పేట ప్రాంతంలో 18 కోట్ల రూపాయల విలువైన మరొక లగ్జరీ బంగ్లా కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఆయన ఆర్థిక భవిష్యత్తుపై ఉన్న దూరదృష్టిని తెలియజేస్తున్నాయి. వాహనాల విషయానికి వస్తే ధనుష్‌కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. సేకరణలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ స్పెక్టర్ , బెంట్లీ కాంటినెంటల్ జిటి , ఫోర్డ్ ముస్టాంగ్ వంటి అత్యంత ఖరీదైన వేగవంతమైన వాహనాలున్నాయి.
7.5 కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఇటీవల కొనుగోలు చేసారు. ఆధునిక సాంకేతికత .. విలాసం పట్ల ఆసక్తిని చాటి చెబుతోంది. ధనుష్ ఒక్కో చిత్రానికి 20 నుంచి 35 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా ఆర్జిస్తున్నారు. ప్రతి నెలా సుమారు 3 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని పొందుతుంటారని అంచనా. అంతర్జాతీయ చిత్రాల్లో నటించడం, సొంత నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిలిమ్స్ ద్వారా చిత్రాలను నిర్మించడం వంటివి ధనుష్ ఆర్థిక మూలాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.
అంతటి సంపద, విలాసాలు ఉన్నా? ధనుష్ వ్యక్తిగతంగా చాలా సాధారణంగా ఉంటుంది. బయటకు వెళ్లాలంటే పలానా బ్రాండ్ కారు ఉండాలని లేదు. ఆ సమయానికి ఏది అందుబాటులో ఉంటే అందులో వెళ్లిపోతారు. షూటింగ్ సమయంలో ఎలాంటి పరిస్థతులున్నా? సర్దుకుపోవడం ధనుష్ ప్రత్యేకతగా చెబుతున్నారు. అలాగే పనిపై చూపే నిబద్ధత ..క్రమశిక్షణే ధనుష్ ని ఈ స్థాయికి చేర్చాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా? ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటారు. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం ధనుష్ ప్రత్యేకత. ఆస్తులు ఎంతటివైనా? తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసుల్లో ఆయన సంపా దించుకున్న గుర్తింపు అన్నిటికంటే మిన్న. ఆర్థికంగా ఎంత ఎదిగినా? కళాత్మక విలువలను వదులుకోకుండా, నటుడిగా , దర్శకుడిగా కొత్త శిఖరాలను అధిరోహించడం ధనుష్ గొప్పతనం.