ధనుష్ తెలివైన నిర్ణయమా? శంకర్ తో ప్రాజెక్టు వెనుక అసలు కథ ఏంటి ?

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చాటలేకపోతోంది.

Update: 2026-08-02 08:08 GMT

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొన్ని రోజులుగా చేస్తున్న ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చాటలేకపోతోంది. పేలవమైన కథ, కథనంతో, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో తన డ్రీమ్ ప్రాజెక్టు వెల్పరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అంటూ వార్తలు రాగా.. మరొకవైపు ధనుష్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ధనుష్ కొత్త మూవీ పూజా కార్యక్రమాలలో శంకర్..

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ధనుష్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే రెండు నేషనల్ అవార్డులను కూడా అందుకోబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈయన 'ఓం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు డైరెక్టర్ శంకర్ హాజరు కావడం కొత్త ఊహాగానాలకు తెరలేపింది. అందుకే శంకర్ కలల ప్రాజెక్టు అయిన వెల్పరిలో ధనుష్ నటించబోతున్నారని, అందుకే ధనుష్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలలో శంకర్ పాల్గొన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఊహాగానాలకు తెర..

అసలు విషయంలోకి వెళ్తే.. కారా సినిమాతో భారీ డిజాస్టర్ చూసిన తర్వాత ధనుష్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓం తర్వాత ధనుష్ తమిళరాసన్ పచ్చముత్తు తో కలిసి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని అలాగే సెల్వరాజ్ తో ఒక చారిత్రక చిత్రం, వెట్రిమారన్ తో తమిళ మురుగన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ధనుష్. ఇలాంటి సమయంలో శంకర్ సినిమా ప్రస్తావన వచ్చింది.

ధనుష్ నిర్ణయం ఎటువైపు?

అయితే ఈ మేరకు ధనుష్ కి శంకర్ ఒక లైన్ ఆలోచనను ప్రతిపాదించినప్పటికీ ..ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ధనుష్ కి వరుసగా అనేక కమిట్మెంట్లు ఉండడం, మరొకవైపు శంకర్ గత చిత్రాల తాలూకా ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ధనుష్ తెలివైన నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శంకర్ కి ఛాన్స్ ఇస్తే ఖరీదైన నష్టంగా ధనుష్ అభిమానులు అభిప్రాయపడుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఎవరు ఎన్ని ఊహాగానాలు వ్యక్తం చేసినా.. భవిష్యత్తులో శంకర్, ధనుష్ కలిసి పని చేస్తారా ? లేదా అసలు ఈ కలల కలయిక ఎప్పటికీ కలవదా? అనే విషయం తెలియాలి అంటే.. ఎవరో ఒకరు స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

Tags:    

Similar News