క్లైమాక్స్‌ను ఖండిస్తూ కోర్టుకు వెళ్లనున్న ధనుష్ టీమ్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దాని వల్ల ఎన్ని ప్లస్సులున్నాయో, దానికంటే ఎక్కువ మైనస్సులు కూడా ఉన్నాయి.;
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దాని వల్ల ఎన్ని ప్లస్సులున్నాయో, దానికంటే ఎక్కువ మైనస్సులు కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది. ఏది నిజమో ఏది కాదో తెలియడం లేదు. దీని వల్ల ఒరిజినల్ టాలెంట్ కు చాలా నష్టం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఏఐతో చేయలేనిది ఏం లేదన్నంతగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే చాలానే మార్పులొస్తున్నాయి.
ఏఐ ద్వారా క్లైమాక్స్ మార్పు
అందులో భాగంగానే రీసెంట్ గా బాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన రాంఝనా మూవీ క్లైమాక్స్ ను రీసెంట్ గా ఏఐ ద్వారా మార్చారు. రాంఝనా మూవీ రీసెంట్ గా రీరిలీజవగా ఆ సినిమా తమిళ వెర్షన్ క్లైమాక్స్ లో ధనుష్ చనిపోతే, అతడిని ఏఐ ద్వారా బతికించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుసుకున్న సినిమా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో పాటూ హీరో ధనుష్ కూడా ఈ విషయంలో మండిపడ్డారు.
లీగల్ చర్యలకు రెడీ అవుతున్న హీరో డైరెక్టర్
అంతేకాదు, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ధనుష్, డైరెక్టర్ తో పాటూ కలిసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏఐని వాడి అందులోని నటీనటుల అనుమతి లేకుండా వారి యాక్టింగ్ ను మార్చడం సరైనది కాదని, ఇది చట్టపరమైన సమస్యలను సృష్టిస్తుందని డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.
వదిలేస్తే ఇది కంటిన్యూ అవుతుంది
ఈ విషయంపై చర్చలు తీసుకోకుండా ఉంటే ఫ్యూచర్ లో ఇతర సినిమాలకు కూడా ఇది ఓ ఎగ్జాంపుల్ గా మారుతుందని హెచ్చరించారు. ధనుష్ కూడా ఈ విషయంపై లీగల్ గా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 2013లో ధనుష్ హీరోగా ఆనంద్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ విషాదంగా ముగియడం తమిళ ఆడియన్స్ కు నచ్చలేదని, అందుకే క్లైమాక్స్ ను మార్చి హ్యాపీ ఎండింగ్ తో రీరిలీజ్ చేసినట్టు నిర్మాతలు చెప్పారు. సినిమా క్లైమాక్స్ ను మార్చడమంటే సినిమా యొక్క ఆత్మను చంపడమేనని, గత పన్నెండేళ్లుగా ఈ సినిమాను గుండెల్లో పెట్టుకున్న ఫ్యాన్స్ నమ్మకాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని డైరక్టర్ ఆనంద్ రాయ్ తెలిపారు.