లవ్ లేకుండానే బ్రేకప్? ధనుష్–మృణాల్ స్టోరీ వైరల్!

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లవ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2026-06-21 03:56 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ లవ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమే లేదు కానీ అప్పుడే బ్రేకప్ కూడా అయిపోయిందంటూ వస్తున్న లేటెస్ట్ రూమర్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. అసలు లవ్వే లేనప్పుడు ఈ బ్రేకప్ గోలేంటి? ఈ క్రేజీ గాసిప్స్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం..

సోషల్ మీడియాలో బ్రేకప్ గాసిప్స్ హల్‌చల్:

రీసెంట్‌గా ‘కారా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సినిమాల కంటే కూడా ఆయన పర్సనల్ లైఫ్ గురించే మీడియాలో ఎక్కువ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలకు బ్రేక్ పడకముందే.. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారంటూ సరికొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఇక దాంతో అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.. మొత్తుకున్న మృణాల్:

నిజానికి గతంలోనే ఈ డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ చాలా స్పష్టంగా స్పందించింది. తామిద్దరం ప్రేమలో లేమని, కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయినా సరే, బాలీవుడ్‌లోని కొన్ని మీడియా సంస్థలు కావాలనే వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి నిరంతరం గాసిప్స్ రాస్తూనే ఉన్నాయి. ఇక నటీనటులు ఎంతలా ఖండించినా వినకుండా.. ఇప్పుడు ఏకంగా బ్రేకప్ స్టోరీలను కూడా స్క్రీన్ పైకి తెచ్చేశారు.

ఇదంతా మీడియా సృష్టించిన గిమ్మిక్కేనా:

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ధనుష్, మృణాల్ మధ్య నడిచిన ఈ లవ్ అండ్ బ్రేకప్ స్టోరీ మొత్తం ఒక సెక్షన్ మీడియా క్రియేట్ చేసిన గిమ్మిక్కేనని తెలుస్తోంది. ఇక కేవలం వ్యూస్ కోసం, అటెన్షన్ కోసమే కొందరు కావాలని ఈ రూమర్లను అగ్రెసివ్‌గా ప్రచారం చేశారని ఇండస్ట్రీ టాక్. టైమ్ గడిచేకొద్దీ ధనుష్, మృణాల్ అసలు ఎప్పుడూ రిలేషన్‌షిప్‌లో లేరనే విషయం అందరికీ క్లియర్‌గా అర్థమైపోయింది.

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ఎలాంటి అఫైర్ లేకపోయినా.. ఇలాంటి ఫేక్ లవ్ స్టోరీలు, బ్రేకప్ గాసిప్స్ రావడం కొత్తేమీ కాదు. ధనుష్–మృణాల్ విషయంలో కూడా జరిగిందదేనని తేలిపోయింది. మరి ఇప్పటికైనా ఈ బాలీవుడ్ మీడియా గాసిప్స్ రాయడం ఆపి, వారిద్దరి సినిమాలపై ఫోకస్ పెడుతుందో లేదో చూడాలి!

Tags:    

Similar News