తెరె ఇష్క్ మైన్.. ట్రైలర్ అదిరిందిగా..!

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కలిసి ఇదివరకు రాంజానా సినిమా చేశారు. ఆ సినిమాలో కూడా ఒక క్రేజీ లవ్ స్టోరీ చెప్పారు.;

Update: 2025-11-15 04:07 GMT

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తెర ఇష్క్ మైన్. టీ సీరీస్ బ్యానర్ లో ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ధనుష్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న తెర ఇష్క్ మైన్ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ మరోసారి ఒక ఇంపాక్ట్ ఫుల్ స్టోరీతో వస్తున్నారని అనిపిస్తుంది. కాలేజ్ లో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్ ఆఫ్టర్ బ్రేకప్ అతనేమో పైలెట్ అయితే ఆమె అతని ప్రేమలో దేవదాసీగా మారుతుంది.

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ రాంజానా..

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కలిసి ఇదివరకు రాంజానా సినిమా చేశారు. ఆ సినిమాలో కూడా ఒక క్రేజీ లవ్ స్టోరీ చెప్పారు. మళ్లీ ఈసారి తెర ఇష్క్ మైన్ తో మరో ప్రేమ కథతో వస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో కృతి సనన్ వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉన్నాయి. ప్రేమికురాలిగా ఆ తర్వాత మద్యం, సిగరెట్ సేవిస్తూ ఆమె కనిపించడం ఆ సీన్స్ లో ఆమె కన్విక్షన్ ఆకట్టుకుంది.

ఇక ధనుష్ కూడా రెండు వేరియేషన్స్ లో తన మార్క్ చూపించాడు. కాలేజ్ గాయ్ గా ఆకట్టుకుంటూనే పైలెట్ గా ఒక ప్రొఫెషనల్ రోల్ లో ఇంప్రెస్ చేయబోతున్నాడు. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల పాత్రల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. తెర ఇష్క్ మైన్ సినిమా ట్రైలర్ చూస్తేనే సూపర్ హిట్ స్టఫ్ అనిపించేస్తుంది. ఇక సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. అప్పుడెప్పుడో కృతి సనన్ తో ఒక గ్లింప్స్ వదిలిన టైం నుంచి ఈ సినిమాపై బజ్ పెరిగింది.

స్టైల్ తో పాటు సౌత్ ఆడియన్స్ రూటెడ్ సినిమాల్లో..

లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ అయ్యారు ఆడియన్స్. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా తమిళ్, తెలుగు భాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో తెర ఇష్క్ మైన్ తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా అదే రోజు రాబోతుంది. రాంజానా తర్వాత మళ్లీ ఆనంద్ ఎల్ రాయ్ తో ధనుష్ చేసిన ఈ అటెంప్ట్ ఎలాంటి రిజల్ట్ అందిస్తుంది అన్నది చూడాలి.

తెర ఇష్క్ మైన్ ట్రైలర్ చూశాక ధనుష్ ని తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిందే. అటు బాలీవుడ్ కథలకు అక్కడ ఆడియన్స్ ని కన్విన్స్ చేసే లుక్ స్టైల్ తో పాటు సౌత్ ఆడియన్స్ రూటెడ్ సినిమాల్లో కూడా ధనుష్ తన వర్సటాలిటీ చూపిస్తాడు. అందుకే అతన్ని ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. తెర ఇష్క్ మైన్ తో ధనుష్ బాలీవుడ్ లో గట్టి ఇంపాక్ట్ చూపించేలా ఉన్నాడని అనిపిస్తుంది.



Full View


Tags:    

Similar News